AI Robot: మరమనిషి చేతికి మంత్రదండం! ఏకంగా కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్.. పూర్తి వివరాలు..
ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం లేదని భరోసా ఉన్నప్పటికీ.. సమీప భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. అయితే ఆ భయాలను నిజం చేసే విధంగానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. ఇప్పుడు ఏకంగా ఓ కంపెనీకి సీఈఓగా నియమితురాలైంది. ఓ హ్యుమనాయిడ్ రోబో పోలాండ్ కు చెందిన ఓ డ్రింక్స్ కంపెనీకి సీఈఓగా చార్జ్ తీసుకుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద సెన్సేషన్. అన్ని కంపెనీలు, స్టార్టప్ లు దీనిని వినియోగించుకోవడం ప్రారంభించాయి. చాట్ జీపీటీ, గూగుల్ బర్డ్ వంటి అనేక సాధనాలు పరిశోధన, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఈ కృత్రిమ మేధ తన ముద్ర వేయడం ప్రారంభించింది. ప్రతి రంగంలోనూ దీని వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో సాధారణంగానే మనిషిలో అభద్రతాభావం మొదలైంది. ఎందుకంటే కంపెనీలు ఎక్కువగా వీటిపై ఆధారపడుతున్నాయి. పని వేగంగా, సులభంగా కృత్రిమ మేధతో కూడిన సాఫ్ట్ వేర్లు పూర్తి చేస్తున్నాయి. ఫలితంగా కావాల్సిన పని క్షణాల్లో పూర్తవుతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతామని భయాన్ని వెల్లడిచేస్తున్నారు. వివిధ సర్వే నివేదికల్లో భిన్నమైన అభిప్రాయాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం లేదని భరోసా ఉన్నప్పటికీ.. సమీప భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. అయితే ఆ భయాలను నిజం చేసే విధంగానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. ఇప్పుడు ఏకంగా ఓ కంపెనీకి సీఈఓగా నియమితురాలైంది. ఓ హ్యుమనాయిడ్ రోబో పోలాండ్ కు చెందిన ఓ డ్రింక్స్ కంపెనీకి సీఈఓగా చార్జ్ తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రయోగాత్మక సీఈఓగా రోబో..
ఈ హ్యుమనోయిడ్ రోబో పేరు మికా. పోల్యాండ్ కు చెందిన డ్రింక్స్ కంపెనీ డిక్టేడార్ కు ప్రయోగాత్మక సీఈఓగా నియమితురాలైంది. ఈ కంపెనీ రమ్ కు ప్రసిద్ధి చెందింది. దీనిలో రోబో సంస్థ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది, ఇందులో వన్-ఆఫ్ కలెక్షన్లు, కమ్యూనికేషన్లు, వ్యూహాత్మక ప్రణాళికలు కూడా ఉంటాయి. డిక్టేడార్‌లోని యూరప్ హెడ్ మార్క్ స్జోల్డ్‌రోవ్స్కీ ప్రకారం, “డిక్టేడార్ బోర్డు నిర్ణయం విప్లవాత్మకమైనది, సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐతో కూడిన ఈ మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఓ కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు.
మికా విధులు ఇవి..
ఈ మికా రోబో కస్టమ్ బాటిళ్లను రూపొందించడానికి కళాకారులను ఎంపిక చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సంస్థ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోబోట్ తీసుకుంటుంది. లాభనష్టాలు, మార్కెటింగ్ వ్యూహం, వ్యాపార వ్యూహం సహా అన్ని విషయాలను ఈ ఏఐ చూసుకుంటుంది. కంపెనీకి మరింత మార్కెటింగ్‌కు ఎలా ముందుకు వెళ్లాలో ఇది నిర్ణయిస్తుంది. ఎక్కడ పెట్టుబడులు లాభపడతాయో అంచనా వేస్తుంది. అంతేకాదు ఈ మికా ఆఫీసు లోపల కూడా సందడి చేస్తుంది. అంటే ఏ డిపార్ట్ మెంట్ పని బాగా జరుగుతోందని, ఎవరు పని సరిగా చేయడం లేదనే విషయాలను ఈ రోబో గమనిస్తూనే ఉంటుంది. ఏ వర్కర్ ఎక్కడ అవసరం, పని పరిధి ఎలా ఉంటుందో మికానే చెబుతుంది. ప్రతి కార్మికుడి పనితీరును తనిఖీ చేస్తుంది. ప్రతి ఉద్యోగి ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఈ కృత్రిమ మేధస్సు రోబో చేతిలో ఉంటుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దీనిపై దృష్టి సారించింది.




ఏఐ వినియోగం పెరుగుతోంది..
ఉత్పాదక రంగంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కంపెనీలు ఏఐ సామర్థ్యాన్ని మరింత వినియోగించుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇది జరిగి తీరుతుందని ప్రస్తుత ట్రెండ్స్, పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి విడుదలైన ఓ నివేదిక ప్రకారం, 2040 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 2.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.4 ట్రిలియన్ డాలర్లను ఒక్క ఏఐ జోడించగలదని చెబుతోంది. అదే సమయంలో కార్మిక ఉత్పాదకతలో 0.1% నుంచి 0.6% వరకు వార్షిక పెరుగుదలను ఏఐ అందించగలదని నివేదిక వివరిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..