Xiaomi Watch2 Pro: ప్రీమియం రేంజ్‌లో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన జియోమీ.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
జియోమీ ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. తన అంతర్జాతీయ ఈవెంట్లో జియోమీ వాచ్2 ప్రో ను ఆవిష్కరించింది. దీనిలో గూగుల్ వేర్ ఓఎస్(Wear OS)ను వినియోగించారు. దీంతో వేగవంతమైన పనితీరు సాధ్యమవుతుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఆరోగ్యం, ఫిట్ నెస్ కోరుకునే వారికి దీనిలో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ జియోమీ వాచ్2 ప్రో స్మార్ట్ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో రిస్ట్ వాచ్ లకు మంచి డిమాండ్ ఉంది. అందుకనుగుణంగా అన్ని టాప్ బ్రాండ్ల నుంచి ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్ డ్ హెల్త్ ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి. వినియోగదారులు కూడా వీటిపై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో జియోమీ ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. తన అంతర్జాతీయ ఈవెంట్లో జియోమీ వాచ్2 ప్రో ను ఆవిష్కరించింది. దీనిలో గూగుల్ వేర్ ఓఎస్(Wear OS)ను వినియోగించారు. దీంతో వేగవంతమైన పనితీరు సాధ్యమవుతుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఆరోగ్యం, ఫిట్ నెస్ కోరుకునే వారికి దీనిలో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ జియోమీ వాచ్2 ప్రో స్మార్ట్ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జియోమీ వాచ్ 2 ప్రో స్టెయిల్ లెస్ స్టీల్ కేసింగ్ ఉంటుంది. లెదర్ లేదా బలమైన ఫ్లోరో రబ్బర్ స్ట్రాప్ లను కలిగి ఉంటాయి. 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. గూగుల్ వ్యాలెట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. నెక్ట్స్ జెన్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 ప్లస్ Gen 1 ధరించగలిగిన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. ఇది డివైజ్కు వేగంతో పాటు శక్తిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్-బ్యాండ్ జీఎన్ఎస్ఎస్ తో కచ్చితత్వాన్ని అందిస్తుంది, 150 స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. ఇవి కచ్చితమైన వర్కౌట్ ట్రాకింగ్‌ని ఇస్తుంది. స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. వినియోగదారులకు వారి నిద్ర విధానాలను అర్థం చేసుకోవడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జియోమీ వాచ్ 2 ప్రో ప్రధాన స్పెసిఫికేషన్‌లు..
- 1.43-అంగుళాల (466 x 466 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్, 600 నిట్స్ వరకు బ్రైట్ నెస్ ఇస్తుంది.
- 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ డబ్ల్యూ5 ప్లస్ జెన్ 1 ప్లాట్ ఫారం ఆధారంగా పనిచేస్తుంది.
- 2జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీతో ఈ వాచ్ వస్తుంది.
- గూగుల్ వేర్ ఓఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
- రోటేటింగ్ క్రౌన్ ఉంటుంది.
- ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, బయోఎలెక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్లు ఉంటాయి.
- 150పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఈ వాచ్ కలిగి ఉంటుంది.
- హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర వంటి వాటిని ట్రాక్ చేసే ఫీచర్లు ఉంటాయి.
- 5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
- ఈవాచ్ 47.6ఎంఎం x 45.9ఎంఎం x 11.8ఎంఎం కొలతలతో ఉంటుంది. దీని బరువు 54.5 గ్రాములు.
- స్ట్రాప్ మెటీరియల్ ఫ్లోరోరబ్బర్/లెదర్ తో వస్తుంది.
- ఈ-సిమ్ కు మద్దతునిస్తుంది.
- 495ఎంఏహెచ్ సామర్థ్యంలో బ్యాటరీ, 55 గంటలు(ఎల్టీఈ వెర్షన్), 65 గంటల (బీటీ వెర్షన్) వరకూ పనిచేస్తుంది.
జియోమీ వాచ్ 2 ప్రో ధర,లభ్యత..
జియోమీ వాచ్ 2 ప్రో 2 వెర్షన్‌లలో లభిస్తోంది. ఇ-సిమ్ వెర్షన్ ఒకటి కాగా మరొకటి బ్లూ టూత్ వెర్షన్. ఈ-సిమ్ వెర్షన్ రిటైల్ ధర EUR 329 (USD 348 / సుమారుగారూ. 29,005 ) నుండి ప్రారంభమవుతుంది. అదే బ్లూటూత్ వెర్షన్ రిటైల్ ధర EUR 269 నుండి ప్రారంభమవుతుంది (USD 284 / సుమారుగా రూ. 23,716 ) ఇది ఐరోపాలోని జియోమీ అధికారిక ఛానెల్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది .
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..