- Telugu News Photo Gallery Technology photos Moto e13 now available in sky blue colour variant and with discount price
Moto E13: కొత్త కలర్‌లో మోటో ఈ13 స్మార్ట్ ఫోన్.. సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్..
పండుగల సీజన్‌ల నేపథ్యంలో ఈ కామర్స్ సైట్స్ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే సేల్స్‌తో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు అక్టోబర్ 8వ తేదీ నుంచి సేల్స్‌ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పటికే తీసుకొచ్చిన మోటో ఈ13 ఫోన్‌లో కొత్త కలర్‌తో పాటు డిస్కౌంట్‌ను అందిస్తోంది..
Updated on: Sep 30, 2023 | 10:11 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో భారత మార్కెట్లోకి మోటో ఈ13 పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్‌లో స్కై బ్లూ కలర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫిబ్రవరిలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 6,999కే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక గత నెలలో ఇదే ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను విడుదల చేసింది.

ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నేపథ్యంలో స్కై బ్లూ కలర్ ఆప్షన్స్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభంకానున్న సేల్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ వేరియంట్ అసలు ధర రూ. 8,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,749కే సొంతం చేసుకోవచ్చు.

వీటితో పాటు ఐసీఐసీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్ఏ ఏకంగా 23 గంటలు పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు 5 ఎంపీతో కూడిన సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.





























