- Telugu News Photo Gallery Technology photos Boat Launches new smartwatch with bluetooth calling in budget price, BoAt Lunar Comet features and price
BoAt Lunar Comet: రూ. 1300లకే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. మార్కెట్లోకి బోట్ కొత్త వాచ్
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్ ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వాచ్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్‌తో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్న బోట్.. తాజాగా మరో కొత్త వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ లూనర్ కామెట్ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 13 వందలకే బ్లూటూత్ కాలింగ్‌తో పాటు, మరెన్నో అధుతాన ఫీచర్స్‌ను ఇందులో అందించారు...
Updated on: Sep 30, 2023 | 3:39 PM

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్.. తాజాగా మార్కెట్లోకి బోట్ లునార్ కామెట్ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1299గా ఉంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సహాయంతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇన్‌బుల్ట్‌గా స్పీకర్‌తో పాటు, మైక్‌ను కూడా అందించారు. రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సెప్టెంబర్ 30వ తేదీ (నేటి) నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది. అమెజాన్‌తో పాటు బోట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ వాచ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ రౌండ్ డిస్‌ప్లే డిస్‌ప్లేను ఇచ్చారు. 500 నిట్స్ బ్రైట్‌నెస్ 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఎలాంటి టచ్ లేకుండా కేవలం చేతిని పైకి లేపడం ద్వారా వాచ్ డిస్‌ప్లే ఆన్ కావడం ఈ వాచ్ ప్రత్యేకత.

ఇక ఈ వాచ్‌తో నేరుగా ఫోన్‌లు సైతం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో 10 కాంటాక్ట్‌ల వరకు సేవ్ చేసుకోవచ్చు. రన్నింగ్, సైక్లింగ్, స్లీప్, హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 వంటి హెల్త్ ఫీచర్స్ అందించారు. ఈ స్మార్ట్ వాచ్ 100ఎఇపైగా స్పోర్ట్స్ మోడల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, స్టాప్‌వాచ్, వెదర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్స్‌ను అందించారు.





























