New Tax Rule: ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు షాక్.. కొత్త రూల్ విడుదల చేసిన ఐటీ శాఖ..వాటికి కూడా పన్ను చెల్లించాల్సిందే..!

Srinu

Srinu |

Updated on: May 25, 2023 | 6:00 PM

తాజాగా ఈ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు షాక్ ఇస్తూ ఆదాయపు పన్ను శాఖ ఓ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు హెచ్చరికలను కూడా జారీ చేసింది. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆన్‌లైన్ గేమింగ్ యాక్టివిటీల ద్వారా రూ. 100 కంటే ఎక్కువ ఆదాయం పొందితే కచ్చితంగా గేమింగ్ సంస్థలు టీడీఎస్ చెల్లించాలి.

New Tax Rule: ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు షాక్.. కొత్త రూల్ విడుదల చేసిన ఐటీ శాఖ..వాటికి కూడా పన్ను చెల్లించాల్సిందే..!
Online Gaming

Follow us on

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కల్చర్ పెరగడంతో చాలా మంది తమ ఫోన్స్‌లో వివిధ గేమ్స్ ఆడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమ్స్‌పై ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆయా గేమింగ్ సంస్థలు కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు గెలిచిన వారికి కొంత సొమ్మును ముట్టజెప్పుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఎక్కువగా యువత ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌పై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించినా వేరేపేర్లతో పాటు ఏపీకే లింక్‌ల ద్వారా కొంతమంది ఈ ఆటను ఇంకా ఆడుతున్నారు. అలాగే ఆన్‌లైన్ క్రికెట్ వంటి ఇతర ఆటలను యువత ఎక్కువగా ఆడుతున్నారు. అయితే తాజాగా ఈ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు షాక్ ఇస్తూ ఆదాయపు పన్ను శాఖ ఓ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలకు హెచ్చరికలను కూడా జారీ చేసింది. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆన్‌లైన్ గేమింగ్ యాక్టివిటీల ద్వారా రూ. 100 కంటే ఎక్కువ ఆదాయం పొందితే కచ్చితంగా గేమింగ్ సంస్థలు టీడీఎస్ చెల్లించాలి. దీనికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. వాస్తవ ఆదాయాలు మాత్రమే కాకుండా,బోనస్‌లు, రెఫరల్ ఇన్సెంటివ్‌లు, అటువంటి ఇతర ప్రేరణలు కూడా టీడీఎస్‌కు లోబడి పన్ను విధించదగిన మొత్తంలో పరిగణిస్తారు. ఈ తాజా ఆదేశాలు జూలై 1, 2023 నుండి అమల్లోకి వస్తాయి. 

ముఖ్యంగా ఏప్రిల్ నెలలో పన్నులను డిపాజిట్ చేయడంలో విఫలమైన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు జూన్ 7లోపు మే పన్ను చెల్లింపుతో పాటు బకాయి ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించాలని తాజా సర్యూలర్ నిర్ధేశించింది. ఈ తేదీకి మించి ఏవైనా ఆలస్యం జరిగితే జరిమానాలు విధిస్తారు.  ఈ గేమింగ్ యాక్టివిటీల నుంచి వచ్చే ఆదాయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను డిక్లరేషన్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంటుంది. సీబీడీటీ రూల్ 133 ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీతో నమోదు చేసిన వినియోగదారు ఖాతాతో అనుసంధానించిన నామకరణంతో సంబంధం లేకుండా, నియమాలు విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది పన్ను విధించదగిన లేదా పన్ను విధించబడని డిపాజిట్లు, జమ చేసిన విజయాలు లేదా ఉపసంహరణలు డెబిట్ చేసినా, అన్ని లావాదేవీలు పరిశీలనకు లోబడి ఉంటాయని పేర్కొంది. బహుళ ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులు కూడా పన్ను పరిధిలోకి వచ్చే అన్ని ఖాతాలలో డిపాజిట్లు, ఉపసంహరణలు, బ్యాలెన్స్‌లతో వారి నికర విజయాలను వ్యక్తిగతంగా లెక్కించవచ్చు. కాబట్టి సీబీడీటీ తీసుకున్న నిర్ణయం ఆ‌న్‌లైన్ గేమింగ్ సంస్థలతో పాటు ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించే వారికి షాకింగ్‌గా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu