6G Technology: 6జీ టెక్నాలజీ వస్తే స్మార్ట్‌ఫోన్లు పనికి రావు.. కీలక వ్యాఖ్యలు చేసిన దిగ్గజ మొబైల్‌ సంస్థ సీఈవో..!

Nokia CEO: ప్రస్తుతం 4G టెక్నాలజీ ఉంది. రానున్న మరికొన్ని నెలల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుండటంతో మరిన్ని..

6G Technology: 6జీ టెక్నాలజీ వస్తే స్మార్ట్‌ఫోన్లు పనికి రావు.. కీలక వ్యాఖ్యలు చేసిన దిగ్గజ మొబైల్‌ సంస్థ సీఈవో..!
Follow us

|

Updated on: May 31, 2022 | 3:59 PM

Nokia CEO: ప్రస్తుతం 4G టెక్నాలజీ ఉంది. రానున్న మరికొన్ని నెలల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుండటంతో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక 5G నెట్‌ వర్క్‌ రానేలేదు 6G నెట్‌వ‌ర్క్‌పై దిగ్గజ మొబైల్‌ సంస్థ నోకియా సీఈఓ పెకా లుండ్‌బెర్గ్ (Pekka Lundberg)కీల‌క వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్య‌లు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. 6జీ నెట్‌వ‌ర్క్‌లు ఒక‌సారి ప‌నిచేయ‌డం ప్రారంభిస్తే ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్లు పనికి రావని, అప్పటికి అవి కామన్‌ ఇంటర్‌ఫేస్‌లో ఉండవని పెకా లుండ్‌బెర్గ్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వరల్డ్‌ ఎక‌న‌మిక్ ఫోరంలో నోకియా చీఫ్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. 6జీ టెక్నాల‌జీ అందుబాటులోకి వచ్చినట్లయితే కామ‌న్ ఇంట‌ర్‌ఫేస్‌గా అంద‌రూ ఉప‌యోగించే స్మార్ట్‌ఫోన్‌ల స్ధానంలో ఏ డివైజ్ ముందుకొస్తుంద‌నే విష‌య‌మై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. న్యూరాలింక్ వంటి ప‌లు కంపెనీలు శ‌రీరంలో నిక్షిప్తం చేసే చిప్స్ నిర్మాణం వంటివి. ఇవి అభివృద్ధిపై క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి. 6జీ ఇంకా ప్రారంభ ద‌శ‌లో ఉన్నందున వీటికి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

వాణిజ్య ఉపయోగం కోసం సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత 6G రోల్‌అవుట్ వేగంగా, సాఫీగా జరిగేలా చూసేందుకు ఇప్పటికే ఒక టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. భారతదేశం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దేశం తన స్వదేశీ 6G సాంకేతికతపై పనిచేస్తోందని, ఇది 2023 లేదా 2024 నాటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు 6జీ నెట్‌ వర్క్‌లకు సిద్ధమవుతుండగా, భారత్‌ వంటి దేశాలు ఇంకా 5జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. వ‌చ్చే సంవత్సరం ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం జ‌ర‌గ‌నుండ‌గా ఆపై క‌మ‌ర్షియ‌ల్‌గా 5జీ నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌చ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..