AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestlers Protest: రెజ్లర్లకు అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ సపోర్ట్.. చర్యలు తీసుకోవాలంటూ వార్నింగ్

బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ... యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చర్యలు తీసుకోకపోతే ముందుముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

Wrestlers Protest: రెజ్లర్లకు అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ సపోర్ట్.. చర్యలు తీసుకోవాలంటూ వార్నింగ్
Wrestlers Protest
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2023 | 5:22 AM

Share

బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ… యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చర్యలు తీసుకోకపోతే ముందుముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

నిన్నటి వరకూ ఢిల్లీకే పరిమితమైన భారత రెజ్లర్ల అంశం.. ఇప్పుడు అంతర్జాతీయ చర్చగా మారింది. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మల్లయోధులకు అండగా నిలిచింది. చివరకు వాళ్లు కష్టపడి సాధించిన పథకాలను గంగా నదిలో వేసేందుకు హరిద్వార్ వెళ్లారు. ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమయ్యారు. రైతు సంఘం నేతల విజ్ఞప్తి మేరకు తమ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు వాయిదా వేశారు రెజ్లర్లు. ఈ పరిణామాలన్నీ గమనించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను హెచ్చరించింది. పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది.

బ్రిజ్ భూష‌ణ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తేల్చేందుకు చేప‌ట్టిన ద‌ర్యాప్తు క‌మిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ స‌మాఖ్యకు ఎన్నిక‌లు నిర్వహించ‌కుంటే.. ఆ ఫెడరేష‌న్‌ను స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చరించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జ‌ర‌గాల్సిన ఆసియా చాంపియ‌న్‌షిప్‌ను మ‌రో చోటుకు త‌ర‌లించే నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ(UWW) ప్రకటించింది. ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు భారీ మూల్యం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది యూడబ్ల్యూడబ్ల్యూ(UWW). ఇప్పుడు వరల్డ్ రెజ్లింగ్ బాడీ ఎంట్రీతో ఈ వివాదానికి పరిష్కారం. దొరుకుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!