IND VS SA: అవుట్ చేసే అవకాశం వచ్చినా.. ఆ దక్షిణాఫ్రికా ఆటగాడిని వదిలేసిన చాహర్.. క్రీడా స్ఫూర్తిని చాటుతూ..
దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగిసింది. భారత్ 2-1 తేడాతో సిరీస్ గెల్చుకుంది. మొదటి రెండు మ్యాచ్ లను వరుసగా గెల్చుకున్న టీమిండియా మూడో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగుల..
దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగిసింది. భారత్ 2-1 తేడాతో సిరీస్ గెల్చుకుంది. మొదటి రెండు మ్యాచ్ లను వరుసగా గెల్చుకున్న టీమిండియా మూడో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. 228 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భారత్ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. ఈమ్యాచ్ లో 18.3 ఓవర్లలో 178 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో మూడో మ్యాచ్ లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ ను అవుట్ చేసే అవకాశం వచ్చిప్పటికి దీపక్ చాహర్ అవుట్ చేయకూడదని నిర్ణయించుకుని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. వాస్తవానికి నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్నప్పటికి బ్యాట్స్ మెన్ క్రీజులో లేకపోతే అతడిని బౌలర్ బంతితో వికెట్లను కొడితే అవుట్ గా పరిగణిస్తారు. ఐసీసీ క్రికెట్ నిబంధనలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో త్వరగా రన్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బౌలర్ బంతి విసరకముందే కొంత మంది బ్యాట్స్ మెన్స్ క్రీజు దాటి ముందుకు వెళ్లిపోతారు. ఇలా వెళ్లినప్పుడు బౌలర్ బాల్ తో వికెట్లను కొడితే ఆ బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టాల్సి వస్తుంది.
ఇటీవల భారత్-ఇంగ్లాండ్ మధ్య మహిళల వన్డే మ్యాచ్ లో నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డీన్‌ను భారత క్రీడాకారిణి దీప్తి శర్మ రనౌట్ చేయడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇలా చేయడాన్ని అనేక మంది విమర్శించారు.ఇలాంటి ఘటనే భారత్ – దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో చోటుచేసుకుంది. 16వ ఓవర్‌లో చాహర్ మొదటి బంతిని వేయబోతుండగా బౌలర్ ను గమనించకుండా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న స్టబ్స్ క్రీజు దాటి ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన దీపక్ చాహర్ బంతిని వేయకుండా ఆగిపోయాడు. అయితే అదే సమయంలో బంతితో వికెట్లను కొడితే స్టబ్స్ అవుట్ అయ్యేవాడు. కాని దీపక్ చాహర్ అలా చేయకుండా.. బాల్ వేయకుండా క్రీజు దాటి వెళ్లకూడదంటే బ్యాట్స్ మెన్ ను హెచ్చరించాడు. అయితే బాల్ వేయలేదనే విషయాన్ని గమనించిన స్టబ్స్ వెనక్కి తిరిగి చూసి.. క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు ఒకరిని చూసి ఒకరు నవ్వకున్నారు.
గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి అవుట్స్ చేశారు. అవి అనేక విమర్శలకు దారితీశాయి. ఈఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శుభారంభాన్నివ్వడంతో పాటు రిలీ రోసౌ సెంచరీతో నాటౌట్ గా నిలవడంతో ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. కాగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య అక్టోబర్ 6 నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.
Kahan chal diye janaab? pic.twitter.com/OVk8EyYhS7
— AreBabaRe (@AreBabaRe2) October 4, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..