Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ జట్టు.. కొరియాతో సమరానికి సిద్ధం
క్వార్టర్ ఫైనల్స్‌లో భారత జట్టు కొరియాతో తలపడనుంది. ఎంతో కఠినమైన ఈ మ్యాచ్‌ను గెలిచేందుకు భారత్ ఆర్చర్లు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పతకానికి మరింత దగ్గరకానున్నారు.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో భారత పతక ఆశలు సజీవంగా ఉన్నాయి. భారత పురుషుల బృందం విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్స్ చేరింది. భారత త్రయం అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణదీప్ రాయ్‌లు.. కజకిస్తాన్ పురుషుల జట్టును 6-2 తేడాతో ఓడించారు. ప్రీ-క్వార్టర్లో భాగంగా జరిగిన ఈ మ్యాచులో అద్భుత విజయం సాధించింది. భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియా జట్టుతో తలపడేందుకు సిద్ధమయ్యారు. కజకిస్థాన్‌తో భారత ఆర్చర్లు గొప్ప ఆరంభాన్ని అందించారు. తొలి రౌండ్‌లో భారత్ 2 పాయింట్లు దక్కించుకుంది. అతాను జాదవ్ పర్ఫెక్ట్ 10తో భారత్‌కు ఈ పాయింట్లు లభించాయి. రెండవ సెట్‌లోనూ భారత ఆర్చర్లు గెలిచారు. ఖజకిస్తాన్ 8-8-8తో ప్రారంభించరు. దీనికి భారత్ 10-9-9తో బదులిచ్చింది. అనంతరం కజకిస్తాన్ రెండో రౌండ్లో 9-9-8 స్కోరు సాధించగా, భారత్ కూడా ఈ రౌండ్లో 8-7-9తో గెలిచింది.
కజకిస్తాన్ మూడో రౌండ్లో గెలిచినా.. కజకిస్తాన్ మూడవ రౌండ్లో గెలిచింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం ఆ జట్టుకు జరిగిపోయింది. మూడో రౌండ్‌లో భారత్ 60 లో 56 పాయింట్లు సాధించింది. కజకిస్తాన్ 57 పాయింట్లు చేసింది. కజకిస్తాన్ ఈ రౌండ్లో గెలిచినప్పటికీ దాని ఓటమి నుంచి కాపాడుకోలేకపోయింది.
గెలిచేందుకు 9 పాయింట్లు.. చివరి రౌండ్లో కజకిస్తాన్ 60 లో 54 పాయింట్లు చేసింది. భారత్ గెలవాలంటే చివరి షాట్‌లో భారత్‌కు 9 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు అవసరం. అతాను దాస్ 9 పరుగులు చేసి జట్టుకు 6-2తో అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో భారత్ క్వార్టర్ ఫైనల్ టికెట్ అందుకుంది. కొరియన్ జట్టుతో తలపడనుంది. భారత ఆర్చరీ జట్టు కొరియా సవాలును అధిగమిస్తే, పతకం సాధించే అవకాశాలను మరింతగా పెంచుకోనుంది. ఈ మ్యాచ్ రాత్రి 10.15 గంటలకు ప్రారంభమవనుంది.
Also Read:
IND vs SL: అరంగేట్రంలోనే చెత్త రికార్డ్.. గోల్డెన్ డక్‌లో మరో టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా..!