Tokyo Olympics 2020: రెండవ మ్యాచ్‌తోనే వెనుదిరిగిన భవానీ దేవి.. ఫెన్సింగ్‌లో పతక ఆశలు గల్లంతు!

రెండవ మ్యాచ్‌లో భవానీ ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రూనెట్ చేతిలో ఓడిపోయింది. ప్రపంచ ర్యాకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్న బ్రూనేట్‌ చేతిలో భవానీ దేవి 15-7తో ఓడిపోయింది.

Tokyo Olympics 2020: రెండవ మ్యాచ్‌తోనే వెనుదిరిగిన భవానీ దేవి.. ఫెన్సింగ్‌లో పతక ఆశలు గల్లంతు!
Olympics debutant Bhavani Devi
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2021 | 9:24 AM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ భవానీ దేవి ప్రయాణం 32 వ రౌండ్‌లో ముగిసింది. తన రెండవ మ్యాచ్‌లో ఆమె ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రూనెట్ చేతిలో ఓడిపోయింది. ప్రపంచ 3వ నంబర్ బ్రూనెట్‌తో జరిగిన మ్యాచుల్ భవానీ దేవి 15-7తో ఓడిపోయింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్ వేదికపై భవానీ దేవి తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఒలింపిక్ అరంగేట్రం చేసి, తన మొదటి మ్యాచ్‌ను 15-3 తేడాతో సులభంగా గెలిచింది. వెంటనే రెండో మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఒలింపిక్ వేదికపై ఫెన్సింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మహిళగా భవానీ దేవి పేరుగాంచింది. ట్యునీషియాకు చెందిన నాడియా బెన్ అజీజ్‌పై 6 నిమిషాల 14 సెకన్లలో తన తొలి మ్యాచ్‌ను సులభంగా గెలిచింది. కానీ, తన రెండో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 3 ఫెన్సర్ ముందు సత్తా చాటలేకపోయింది. భవానీ ఓటమితో ఫెన్సింగ్‌లో భారత పతక ఆశలు ఆవిరయ్యాయి.

ఫ్రాన్స్‌కు చెందిన మనోన్ బ్రూనెట్ రియో​ఒలింపిక్స్‌లో సెమీ ఫైనలిస్ట్. అక్కడ ఆమె నాలుగవ స్థానంలో చేరింది. పతకానికి చాలా దగ్గరగా వెళ్లింది. కానీ, టోక్యోలో ఆమె తన లక్ష్యాన్ని పెట్టలేకపోయింది. రియోలో తన అనుభవం టోక్యోలో పనిచేయలేకపోయింది. తొలి మ్యాచ్లో అద్భుతంగా ఆడి, తన దూకుడును ప్రదర్శించి, అజిజీపై విజయం సాధించింది. తొలి ఒలింపిక్స్ ఆడుతున్న భవానీ దేవి.. ఒత్తిడిని భరించి, రెండవ మ్యాచ్‌ వరకు చేరుకుంది. దీని నుంచి మరిన్ని పాఠాలు నేర్చుకుంటానని, మరోసారి కచ్చితంగా తన సత్తా చూపిస్తానని పేర్కొంది.

Also Read:

Hardik Pandya Viral Video: మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆల్ రౌండర్ ఏం చేశాడో తెలుసా..? నెట్టింట్లో పేలుతోన్న సెటైర్లు

Tokyo Olympics 2020 Live: రెండవ రౌండ్లో గెలిచిన అచంత్ శరత్ కమల్.. క్వార్టర్ ఫైనల్ చేరిన పురుషుల ఆర్చరీ జట్టు

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..