Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భవానీ దేవి శుభారంభం.. తొలిపోరులో ఘన విజయం

ఒలింపిక్స్‌లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము)లో తొలిపోరులో విజయం సాధించింది. సోమవారం తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో విజయం సాధించింది.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భవానీ దేవి శుభారంభం.. తొలిపోరులో ఘన విజయం
Bhavani Devi In Tokyo Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2021 | 7:09 AM

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము)లో తొలిపోరులో విజయం సాధించింది. సోమవారం తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో విజయం సాధించింది. కేవలం 6 నిమిషాల 14 సెకండ్లలోనే విజయం సాధించింది. దాంతో భవానీ దేవీ తరువాతి రౌండ్‌కు అర్హత సాధించింది. కాగా, ఇండియా నుంచి ఫెన్సింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణిగా పేరుగాంచింది. తన తదుపరి మ్యాచును ప్రపంచ ర్యాకింగ్స్‌లో 4వస్థానంలో ఉన్న ఫ్రెంచ్ క్రీడాకారిణి బ్రూనెట్‌ను ఎదుర్కొంటుంది. భవానీ దేవి ప్రస్తుతం ప్రపంచ ర్యాకింగ్స్‌లో 29వ స్థానంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మూడవ రోజు భారత్‌కు అంతగా కలిసి రాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ నిరాశపరిచింది. బ్యాడ్మింటన్‌లో మొదటి రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రెండవ షూటింగ్ ఈవెంట్‌లో భారత్ నిరాశను ఎదుర్కోవలసి వచ్చింది. మేరీ కోమ్ తన పంచ్‌తో తరువాత రౌండ్‌కు చేరింది. నాలుగవ రోజు షూటింగ్‌లో పురుషుల స్కీటింగ్ ఈవెంట్‌లో అంగద్ వీర్ సింగ్, మైరాజ్ అహ్మద్‌ పోటీపడనున్నారు. నాలుగవ రోజు కూడా షూటింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. మరోసారి భారత్ ఈ ఈవెంట్‌లో పతకం కోసం ఎదురుచూస్తోంది. మొదటి మూడు రోజులు షూటింగ్ విభాగంలో నిరాశే ఎదురైంది. దీంతో నాలుగవ రోజు షూటింగ్ ఈవెంట్‌లోనైనా పతకం దక్కుతుందో లేదో చూడాలి.

Also Read:

Tokyo Olympics 2020, Day 4: జులై 26న భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్ ఇదే.. పతకం బరిలో నిలిచేదెవరో..!

Tokyo Olympics 2020 Live: తొలి పోరులో విజయం సాధించిన భవానీ దేవి; విజయంతో 4వ రోజును ప్రారంభించిన భారత్