Hardik Pandya Viral Video: మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆల్ రౌండర్ ఏం చేశాడో తెలుసా..? నెట్టింట్లో పేలుతోన్న సెటైర్లు

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. శిఖర్ సేన 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక టీం 126 పరుగులకు అలౌట్‌ అయింది.

Hardik Pandya Viral Video: మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆల్ రౌండర్ ఏం చేశాడో తెలుసా..? నెట్టింట్లో పేలుతోన్న సెటైర్లు
Hardik Pandya
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2021 | 8:16 AM

Hardik Pandya: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. శిఖర్ సేన 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక టీం 126 పరుగులకు అలౌట్‌ అయింది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జాతీయ గీతాలను ఆలపిస్తారని తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ముందుగా టీమిండియా ఆటగాళ్లు భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం శ్రీలంక జాతీయ గీతం పాడుతున్నారు. హార్దిక్‌ పాండ్యా కూడా శ్రీలంక ప్లేయర్లతో కలిసి వారి దేశ జాతీయ గీతానికి పెదవులు కలిపిస్తూ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో వైరల్‌‌గా మారింది.

హార్దిక్‌ పాండ్యా శ్రీలంక జాతీయ గీతాన్ని పాడడంపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. శ్రీలంక జాతీయ గీతానికి భారత ఆల్ రౌండర్ ఫిదా అయ్యాడని కొందరు కామెంట్ చేస్తే.. మ్యూజిక్ లవర్ కాబట్టే అలా హమ్ చేశాడని మరికొందరు కామెంట్లు చేశారు. తొలిసారి అనుకుంటా.. ఓ ప్రత్యర్థి టీం జాతీయ గీతాన్ని ఇలా ఆలపించడమంటూ మరికొందరు కామెంట్లు చేశారు. భారత ఆటగాడు శ్రీలంక జాతీయ గీతాన్ని పాడడం చాలా ఆనందంగా ఉందంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్‌(10) మరోసారి విఫలమయ్యాడు. దాంతో మరికొందరు మ్యాచ్‌లో చేసేదేమీ ఉండదు కదా.. ఇలా పాటలైనా పాడుకుంటాను అంటూ కామెంట్లు చేశారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా మొదటి బంతికే ఔటయ్యాడు. సంజు శాంసన్ 27 పరుగులు, శిఖర్ ధావన్ 46 పరుగులు, సూర్య కుమార్ 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లులతో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్య 10 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభంచిన శ్రీలంక టీం126 పరుగులకు చేతులెత్తేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు వికెట్లు తీయగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీశాడు.

Also Read:

IPL 2021 Shedule: ఐపీఎల్ ఫేజ్‌2 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే..!

Tokyo Olympics 2020 Live: తొలి పోరులో విజయం సాధించిన భవానీ దేవి.. క్వార్టర్ ఫైనల్ చేరిన పురుషుల ఆర్చరీ జట్టు