IND vs SL: అరంగేట్రంలోనే చెత్త రికార్డ్.. గోల్డెన్ డక్‌లో మరో టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా..!
Venkata Chari |
Updated on: Jul 26, 2021 | 9:39 AM
భారత్, శ్రీలంక టీంల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తన తొలి టీ20 మ్యాచ్ పృథ్వీ షాకు మాయని మచ్చలా తయారైంది.
Jul 26, 2021 | 9:39 AM
భారత్, శ్రీలంక టీంల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తన తొలి టీ20 మ్యాచ్ పృథ్వీ షాకు మాయని మచ్చలా తయారైంది. తొలి బంతికే ఔటయ్యి.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. వన్డేల్లో అరంగేట్రం చేసిన షా.. తొలి 5 ఓవర్లలో చాలా రికార్డులు సృష్టించాడు. అయితే టీ20 తొలి మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్‌ను నమోదు చేశాడు.
1 / 5
టీ 20 లో భారత్ తరఫున ఓపెనింగ్ చేసిన అతి పిన్న వయస్కుడిగా మరో రికార్డును నెలకొల్పాడు. 21 సంవత్సరాల 258 రోజుల వయసులో తొలి టీ20లో అరంగేట్రం చేశాడు. దీంతో రోహిత్ శర్మను వెనుకకు నెట్టేశాడు. రోహిత్ 22 సంవత్సరాల 37 రోజుల వయసులో టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఆతర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ (22 సంవత్సరాల 65 రోజులు), ఇషాన్ కిషన్ (22 సంవత్సరాల 239 రోజులు), అజింక్య రహానె (23 సంవత్సరాల 86 రోజులు) ఉన్నారు. పృథ్వీ షా 24 ఏళ్ళకు ముందే టెస్టులు, వన్డేలు, టీ 20 ల్లో అడుగుపెట్టిన తొలి భారతీయ బ్యాట్స్ మెన్‌గా రికార్డులు నెలకొల్పాడు.
2 / 5
పృథ్వీ షా తన తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ తరఫున పరుగుల ఖాతా తెరవకుండా ఔటైన మూడో బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే దుష్మంత చమీరాకు చిక్కాడు. అంతకుముందు 2006లో మహేంద్ర సింగ్ ధోని దక్షిణాఫ్రికాపై, 2016 లో కేఎల్ రాహుల్ జింబాబ్వేపై సున్నాకు వెనుదిరిగారు.
3 / 5
వేర్వేరు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించడం లేదా పరుగుల ఖాతా తెరవకుండా పృథ్వీ షా మరో రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన షా.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. షా కంటే ముందు మరో ఇద్దరు బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మాథ్యూ సింక్లైర్ టీ 20, వన్డే ఫార్మాట్లలో ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. కానీ, టెస్ట్ అరంగేట్రంలో 214 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన యునిస్ ఖాన్ కూడా టీ 20 అరంగేట్రంలో గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. టెస్ట్‌లో మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు.
4 / 5
పృథ్వీ షా టీ 20 అరంగేట్రం చేసిన తొలి బంతికే పరుగుల ఖాతా తెరవకుండా ఔట్ అయ్యాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రెండవ టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. షా కంటే ముందు, కేఎల్ రాహుల్ 2016 లో అరంగేట్రం చేసి, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో మొదటి బంతికే ఔట్ అయ్యాడు.