AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: ఘనంగా ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. ఈరోజు పోటీ పడనున్న క్రీడాకారులు ఎవరంటే..

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన టోక్యో ఒలంపిక్స్ ప్రారంభ వేడుక శుక్రవారం మొదలైంది.

Tokyo Olympics 2021: ఘనంగా ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. ఈరోజు పోటీ పడనున్న క్రీడాకారులు ఎవరంటే..
Olymipcs
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2021 | 7:47 AM

Share

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన టోక్యో ఒలంపిక్స్ ప్రారంభ వేడుక శుక్రవారం మొదలైంది. అటు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా నిరాండబరంగానే ఈ వేడుకను నిర్వహించారు నిర్వాహకులు. మొత్తం 42 వేదికలలో.. 33 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి మొత్తంగా 11,500 మంది ఇందులో పాల్గొనున్నారు. మొత్తం 339 స్వర్ణ పతకాలు అందుబాటులో ఉంటాయి. ఇక నిన్న ఉదయం మహిళల వ్యక్తిగత క్యాలిఫైయింగ్ రౌండ్ జరిగింది. అందులో భారత ప్లేయర్స్ అర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్‏లో పాల్గొన్నారు. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఇక ఆర్చరీ వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో తరుణదీప్ రాయ్, దాస్, ప్రవీణ్ జాదవ్ సరిగ్గా రాణించలేదు.

ఇక ఈరోజు 10 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో దీపికాకుమారి, ప్రవీణ్‌ జాదవ్‌ పోటీ పడనుండగా.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య హాకీ పూల్‌-ఏ మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత షూటింగ్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్‌ జరగనుండగా.. జూడో 48 కిలోల విభాగంలో మహిళల మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఇక తర్వాత.. రోయింగ్‌ లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ హీట్‌ పురుషుల విభాగం నుంచి జరుగనుండగా.. ఉదయం 7:30కి టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌.. ఉదయం 8:30కి టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌.. ఉదయం 8:50కి బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌ జరగనుంది. అలాగే చైనీస్‌ తైపీ క్రీడాకారులతో భారత క్రీడాకారులు సాత్విక్‌, షెట్టి చిరాగ్‌ పోటీ పడనున్నారు. ఉదయం 9:30కి షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ అర్హత మ్యాచ్ జరగనుంది. అలాగే ఉదయం 9:30కి బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌ జరుగుతుంది. భారత్ క్రీడాకారుడు.. సాయిప్రణీత్‌ ఇజ్రాయిల్‌ క్రీడాకారుడితో పోటీపడనున్నాడు.

ఇక అనంతరం ఉదయం..10:20కి వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళల 49 కిలోల విభాగం… మధ్యాహ్నం 12 గంటలకు షూటింగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్‌.. మధ్యాహ్నం 12:15 గంటలకు టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌.. ఆ తర్వాత ఒంటిగంటకు టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌.. మధ్యాహ్నం 3:50కి బాక్సింగ్‌లో జపాన్‌ క్రీడాకారుడితో వికాస్‌కృష్ణన్ తలపడనున్నాడు. ఇక సాయంత్రం 5:15కు భారత్‌, నెదర్లాండ్స్‌ మధ్య హాకీ పూల్‌-ఏ మ్యాచ్‌ జరగనుంది.

Also Read: Ammu Abhirami: తెలుగులో అమ్ము అభిరామి హవా.. వెంకటేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Trisha: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్ ?.. కోలీవుడ్‏లో చక్కర్లు కొడుతున్న త్రిష పెళ్లి టాపిక్..