Rohit Sharma: ఇంగ్లండ్ టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

జూలై 1నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టుకు ముందు టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డారు. రోహిత్ కు నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రోహిత్....

Rohit Sharma: ఇంగ్లండ్ టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
Rohit Sharma
Follow us

|

Updated on: Jun 26, 2022 | 8:17 AM

జూలై 1నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టుకు ముందు టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డారు. రోహిత్ కు నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రోహిత్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే.. రోహిత్‌ శర్మ ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో 25 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కాగా గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాక కరోనా కేసుల కారణంగానే ఐదో మ్యాచ్‌ వాయిదా పడింది. అప్పుడు కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. టెస్టుకు ముందే రోహిత్ కు నెగెటివ్ గా తేలకపోతే రిషభ్‌ పంత్‌ లేదా జస్ప్రిత్‌ బుమ్రా కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా ఆదివారం నుంచి ఐర్లాండ్‌తో 2 టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టు ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా, మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది. అయితే ఈ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఐర్లాండ్‌లో ఆడబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ముందున్న సవాళ్లు తక్కువేమీ కావు. భారత్ 2009లో ఒక టీ20, 2018లో 2 మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో, మూడో మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ ఇండియాలో కేవలం 4 మంది ఆటగాళ్లు మాత్రమే ఐర్లాండ్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడారు. మిగిలిన ఆటగాళ్లందరూ తొలిసారిగా అక్కడ ఆడనున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నందున, కొత్త జట్టును నడిపించడం హార్దిక్ పాండ్యా ముందు పెద్ద సవాలుగా నిలవనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి