AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 SRH : టీ20ల్లో 300 వికెట్ల వీరుడు.. రూ.75 లక్షలకే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త అస్త్రం

IPL 2026 SRH : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో, ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డేవిడ్ పేన్ (David Payne)ను ఆరెంజ్ ఆర్మీ ఎంపిక చేసుకుంది.

IPL 2026 SRH :  టీ20ల్లో 300 వికెట్ల వీరుడు.. రూ.75 లక్షలకే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త అస్త్రం
Srh David Payne
Rakesh
|

Updated on: Mar 24, 2026 | 4:21 PM

Share

IPL 2026 SRH : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో, ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డేవిడ్ పేన్ (David Payne)ను ఆరెంజ్ ఆర్మీ ఎంపిక చేసుకుంది. 35 ఏళ్ల ఈ వెటరన్ బౌలర్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువే ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్స్‌లో ఆడిన అపారమైన అనుభవం ఉంది. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో ఈ ఇంగ్లీష్ బౌలర్ ఇప్పుడు హైదరాబాద్ అడ్డాలో అడుగుపెట్టబోతున్నాడు.

ఎవరీ డేవిడ్ పేన్? ఎందుకింత క్రేజ్?

డేవిడ్ పేన్ ఇంగ్లాండ్ తరపున కేవలం ఒకే ఒక్క వన్డే ఆడినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో ఆయన ఒక దిగ్గజం అని చెప్పవచ్చు. బిగ్ బాష్ లీగ్ (BBL), ILT20, ది హండ్రెడ్, టీ20 బ్లాస్ట్ వంటి ప్రపంచ స్థాయి లీగ్స్‌లో ఆయనకు గజం అనుభవం ఉంది. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఆయన 304 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 115 మ్యాచ్‌లు ఆడి 328 వికెట్లు తీసిన రికార్డు ఆయనకుంది. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆయన అన్‌సోల్డ్‎గా మిగిలిపోయారు, కానీ జాక్ ఎడ్వర్డ్స్ గాయం ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో కీలకం

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. విదేశీ పేసర్ల కొరత ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు డేవిడ్ పేన్ రాక పెద్ద ఊరటనిస్తుంది. ఎడమ చేతి వాటం బౌలర్ కావడంతో ఆయన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. ముఖ్యంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో డేవిడ్ పేన్ వికెట్లు తీయడంలో దిట్ట. ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు ఎహ్సాన్ మలింగతో కలిసి పేన్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నారు.

ఈసారి హైదరాబాద్ కెప్టెన్ ఎవరు?

ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించబోతున్నారు. జట్టులో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. వీరికి తోడుగా ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి వంటి క్వాలిటీ బౌలర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ అప్‌డేట్

డేవిడ్ పేన్ చేరికతో సన్‌రైజర్స్ జట్టు సమతూకంగా మారింది. స్పిన్ విభాగంలో జీషన్ అన్సారీ కీలకం కానుండగా, పేస్ విభాగంలో హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్ తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. మార్చి 28న బెంగళూరుతో జరిగే తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ తన సత్తా చాటాలని చూస్తోంది. గాయాల బెడద ఉన్నప్పటికీ, డేవిడ్ పేన్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను తీసుకోవడం ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ తెలివైన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us