అశ్విన్ ఏంటీ బౌలింగ్.. గెలుపు కోసం ఏదైనా.?

ఐపీఎల్‌లో మన్కడింగ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి తన విచిత్రమైన బౌలింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ వైరటీ బౌలింగ్ చేసి విమర్శలపాలయ్యాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నిన్న దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. దీనిలో డ్రాగన్స్ జట్టు 10పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రెండు బాల్స్‌లో గిల్లీస్‌ 17 పరుగులు చేయాల్సిన తరుణంలో […]

అశ్విన్ ఏంటీ బౌలింగ్.. గెలుపు కోసం ఏదైనా.?
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 20, 2019 | 6:13 PM

ఐపీఎల్‌లో మన్కడింగ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి తన విచిత్రమైన బౌలింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తాజాగా జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ వైరటీ బౌలింగ్ చేసి విమర్శలపాలయ్యాడు.

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నిన్న దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. దీనిలో డ్రాగన్స్ జట్టు 10పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రెండు బాల్స్‌లో గిల్లీస్‌ 17 పరుగులు చేయాల్సిన తరుణంలో అశ్విన్ విచిత్రంగా బౌలింగ్ చేసి.. రూల్స్‌ను అతిక్రమించాడు. రాంగ్‌ ఫుట్‌తో బౌలింగ్‌ చేసిన అశ్విన్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయవద్దని హితవు పలికారు. కాగా ఈ టోర్నీలో రవిచంద్రన్ అశ్విన్ దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.