క్రికెట్‌కు సెలవు.. ఆర్మీకి సేవలు!
ప్రపంచకప్ తర్వాత మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మిస్టర్ కూల్ ధోని తన రిటైర్మెంట్ పై ఇవాళ కీలక ప్రకటన చేశాడు. త్వరలో మొదలుకానున్న విండీస్ టూర్‌కు తాను అందుబాటులో ఉండబోనని బీసీసీఐకు స్పష్టం చేశాడు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోని రెండు […]

ప్రపంచకప్ తర్వాత మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మిస్టర్ కూల్ ధోని తన రిటైర్మెంట్ పై ఇవాళ కీలక ప్రకటన చేశాడు. త్వరలో మొదలుకానున్న విండీస్ టూర్‌కు తాను అందుబాటులో ఉండబోనని బీసీసీఐకు స్పష్టం చేశాడు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోని రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు.
ధోని నిర్ణయానికి తాము గౌరవిస్తున్నామని… ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు చేరవేశామని ఆ అధికారి వెల్లడించాడు.దీనితో విండీస్ టూర్‌కు ప్రధాన వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. కాగా సెలెక్టర్లు వెస్టిండీస్ టూర్‌కు పర్యటించే జట్టును రేపు ప్రకటించనున్నారు.
