రిటైర్మెంట్ తరువాత తొలిసారి దుమ్మురేపిన డివిలియర్స్!
రిటైర్మెంట్ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ తర్వాత తొలిసారి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో మిడిలెస్సెక్స్ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 43 బంతుల్లో 88 పరుగులు(6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లార్డ్స్ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్సెక్స్ నిర్దేశించిన […]
రిటైర్మెంట్ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ తర్వాత తొలిసారి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో మిడిలెస్సెక్స్ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 43 బంతుల్లో 88 పరుగులు(6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లార్డ్స్ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఎస్సెక్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెస్సెక్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్ మలాన్‌తో కలిసి డివిలియర్స్ రెచ్చిపోయాడు. వీర్దిదరూ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే మిడిలెస్సెక్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక తొలిసారి టీ20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.
A debut to remember….
? @ABdeVilliers17 already feeling at home at Lord's.#LoveLords pic.twitter.com/WmuKuSvxON
— Lord's Cricket Ground (@HomeOfCricket) July 18, 2019