National Games 2023: ఒలింపిక్స్ నిర్వహణకు రెడీ కావాలి.. జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
క్రీడలకు తమ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు పెంచిందని ప్రధాని మోడీ చెప్పారు. క్రీడలకు బడ్జెట్ తొమ్మిదేళ్ల కిందటితో పోల్చుకుంటే మూడు రెట్లకన్నా ఎక్కువే అన్నారాయన. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని తాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్‌కు చెప్పినట్లు మోదీ వివరించారు.

గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభింభమయ్యాయి. దక్షిణ గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావన్ టి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, గోవా క్రీడల మంత్రి గోవింద్ గౌడ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు తమ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు పెంచిందని ప్రధాని మోడీ చెప్పారు. క్రీడలకు బడ్జెట్ తొమ్మిదేళ్ల కిందటితో పోల్చుకుంటే మూడు రెట్లకన్నా ఎక్కువే అన్నారాయన. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని తాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్‌కు చెప్పినట్లు మోదీ వివరించారు. గోవాలో జాతీయ క్రీడలను నిర్వహించడం ఇదే తొలిసారి. క్రీడల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళాకారుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. గోవాలోని ఐదు నగరాల్లో 43కి పైగా వివిధ క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు పాల్గొంటున్నారు. మపుసా, మార్గోవా , పనాజీ, పోండా మరియు వాస్కో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు పోటీలో పాల్గొంటున్నారు. వీరిలోఒ 49 శాతం మంది మహిళలు. రాష్ట్ర జట్లతో పాటు, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మరియు సర్వీసెస్‌కు చెందిన క్రీడా జట్లు కూడా జాతీయ క్రీడల్లో పాల్గొంటాయి, గత నాలుగు ఎడిషన్‌లలో సర్వీసెస్ విజేతలుగా నిలిచింది.
కాగా ఈ జాతీయ క్రీడలు నవంబర్ 9 వరకు నేషనల్ గేమ్స్ కొనసాగుతాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ‘నేషనల్ గేమ్స్’. వాస్తవానికి కి గోవాలో 2016లో జాతీయ క్రీడలు జరగాల్సింది. 36వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ హక్కులను గోవా సొంతం చేసుకున్నా.. పలుమార్లు వాయిదా పడడంతో కుదరలేదు. చివరకు 37వ నేషనల్ గేమ్స్‌కి గోవా ఆతిథ్యం ఇస్తోంది. గతేడాది గుజరాత్‌లో జాతీయ క్రీడలు జరిగాయి. 35వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ 2015లో కేరళలో జరిగాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ప్రధాని మోడీ..
Inaugurating the 37th National Games in Goa. It celebrates India’s exceptional sporting prowess. https://t.co/X0Q9at0Oby
— Narendra Modi (@narendramodi) October 26, 2023
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
The National Games have commenced in Goa, showcasing talent, determination and sportsmanship.
As athletes push boundaries and inspire the entire nation, let us all come together in celebration of the spirit of sports! pic.twitter.com/rhPA05zP8z
— Narendra Modi (@narendramodi) October 26, 2023
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..