ICC World Cup 2023: పాక్‌ను వెనక్కునెట్టేసిన లంక.. మారిన సెమీస్ లెక్కలు.. లేటెస్ట్ పాయింట్ల పట్టిక ఇదే
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ జట్టు కేవలం 156 పరుగుల స్కోరుకే కుప్పకూలగా.. శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఇంగ్లిష్ జట్టుఇక ఇంటి బాట పట్టినట్టే. శ్రీలంక జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే దిగువన 9వ స్థానానికి చేరుకుంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అవతరించింది. అక్టోబరు 26 గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిన ఇంగ్లిష్ సెమీ ఫైనల్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ జట్టు కేవలం 156 పరుగుల స్కోరుకే కుప్పకూలగా.. శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఇంగ్లిష్ జట్టుఇక ఇంటి బాట పట్టినట్టే. శ్రీలంక జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే దిగువన 9వ స్థానానికి చేరుకుంది. మరోవైపు శ్రీలంక ఏడో స్థానం నుంచి నేరుగా ఐదో స్థానానికి చేరుకుంది. ఇక మిగతా జట్ల విషయానికి వస్తే.. ఆడిన ఐదింటిలోనూ గెలిచిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఖాతాలో కూడా 8 పాయింట్లు ఉన్నప్పటికీ తక్కువ నెట్ రన్ కారణంగా మూడో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో స్థానంలో ఉంది.
వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న పాకిస్థాన్ జట్టు శ్రీలంక విజయంతో ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ 8వ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 9వ స్థానంలో ఉంది. అట్టడుగున నెదర్లాండ్స్ జట్టు ఉంది. కాగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ దక్షిణఫ్రికా కంటే పాకిస్తాన్‌కు ఎంతో కీలకం. హ్యాట్రిక్ పరాజయాలు పొందిన దాయాది సెమీస్ అవకాశాలను నిలుపుకోవాలంటే సఫారీలపై గెలుపొందడం తప్పనిసరి. మరి సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ ఏ మేర అడ్డుకుంటుందో చూడాలి.
పాక్ ను కిందకు దింపేసిన లంక..
Points Table for World Cup 2023.
– India 🇮🇳 is the only unbeaten team so far. pic.twitter.com/CtiOWxhgVT
— Johns. (@CricCrazyJohns) October 26, 2023
శ్రీలంక ఆనంద క్షణాలు..
View this post on Instagram
శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ హైలెట్స్..
View this post on Instagram
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




