AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SA: పాకిస్తాన్‌కు చావో రేవో.. దక్షిణాఫ్రికాతో కీలక పోరు నేడు.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ఇవాళ జరిగే 26వ మ్యాచ్‌లో బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. పాకిస్థాన్ జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సెమీస్‌ రేసులో నిలవాలంటే దాయాది కచ్చితంగా సఫారీలపై విజయం సాధించాల్సి ఉంది.

PAK vs SA: పాకిస్తాన్‌కు చావో రేవో.. దక్షిణాఫ్రికాతో కీలక పోరు నేడు.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
South Africa
Basha Shek
|

Updated on: Oct 27, 2023 | 8:45 AM

Share

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. చిన్న జట్లు సంచలనాలు సృష్టించడం, అనూహ్యంగా పెద్ద జట్లు ఓటమి పాలు అవుతుండడంతో మెగా క్రికెట్ టోర్నీ రసవత్తరంగా మారింది. ఇవాళ జరిగే 26వ మ్యాచ్‌లో బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. పాకిస్థాన్ జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సెమీస్‌ రేసులో నిలవాలంటే దాయాది కచ్చితంగా సఫారీలపై విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం దాదాపు ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. మరోవైపు ఈరోజు దక్షిణాఫ్రికా గెలిస్తే టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది. భారత్ రెండో స్థానానికి పడిపోతుంది. పాక్ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓడిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో బాబర్ సేన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కెప్టెన్ ఫామ్‌లో ఉన్నా జట్టుకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. బౌలర్లలో షాహిన్ అఫ్రిది తప్ప మరెవరూ పెద్దగా రాణించడం లేదు.

పటిష్ఠంగా దక్షిణాఫ్రికా..

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు చాలా బలంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో ఓడిపోవడం మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా నేడు గెలిస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది. భారత్ రెండో స్థానానికి పడిపోతుంది. జట్టులోని ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ 174 పరుగులు చేశాడు. ఆఫ్రికా బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు.

గత రికార్డులివే..

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకు 82 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 51 సార్లు గెలవగా, పాకిస్తాన్ 30 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఇక ప్రపంచ కప్‌లో, రెండు జట్లు ఐదుసార్లు తలపడగా, దక్షిణాఫ్రికా మూడు విజయాలు సాధించగా, పాకిస్తాన్ రెండు సార్లు గెలుపొందింది.

ఇవి కూడా చదవండి

చెన్నై పిచ్ రిపోర్ట్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం బ్యాటర్లు, బౌలర్‌లకు సమంగా ఉపయోగపడుతుంది. ఈ వికెట్ సాధారణంగా పొడిగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకు సహకకరిస్తుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ కాస్త నెమ్మదించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు పరుగులు చేయడం కాస్త కష్టంగా మారుతుంది. అందుకే చాలా జట్లు టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటాయి.

దక్షిణాఫ్రికా జట్టు (అంచనా)

క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కాగిజార్డ్ రజాబాడా, విలియమ్స్ హెండ్రిక్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రిజ్ షమ్సీ.

పాకిస్థాన్ జట్టు (అంచనా)

ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ.

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో