ఒలింపిక్ ప్రారంభోత్సవానికి ముందు ఫ్రాన్స్‌లో గందరగోళం.. హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో విధ్వంసం.. 8 లక్షల మంది ప్రజలపై ప్రభావం

ఫ్రాన్స్ పశ్చిమ, ఉత్తర , తూర్పు ప్రాంతాల రైల్వే లైన్లు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల ప్రభావం డొమెస్టిక్ రైళ్ల పైన మాత్రం కాదు ఛానల్ టన్నెల్ ద్వారా వెళ్ళే పొరుగు దేశాలైన బెల్జియం, లండన్ లకు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం ప్రకారం ఈ విధ్వంసం, దహనం కారణంగా జరిగిన నష్టాన్ని సరిచేయడానికి కనీసం ఆదివారం వరకు పట్టవచ్చు.

ఒలింపిక్ ప్రారంభోత్సవానికి ముందు ఫ్రాన్స్‌లో గందరగోళం.. హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో విధ్వంసం.. 8 లక్షల మంది ప్రజలపై ప్రభావం
Peris Olympic 2024
Follow us
Surya Kala

|

Updated on: Jul 26, 2024 | 6:34 PM

వేసవి ఒలింపిక్స్‌ 2024 ఫ్రెంచ్ రాజధాని పారిస్‌ లో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఫ్రాన్స్‌ రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫ్రాన్స్ జాతీయ రైలు ఆపరేటర్ SNCF దాని హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయని, దీని కారణంగా పలు రైళ్ల సేవలకు భారీగా అంతరాయం ఏర్పడిందని సమాచారం.

ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకకు కొన్ని గంటల ముందు ఫ్రెంచ్ రైలు ఆపరేటర్ కంపెనీ SNCF ఈ మొత్తం విషయాన్ని వార్తా సంస్థ AFPకి తెలియజేసింది. SNCF ఫ్రాన్స్ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై కాల్పులు జరిపినట్లు చెప్పారు. దీంతో రవాణా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని తెలిపారు.

ఫ్రాన్స్ రైల్వే సర్వీసుపై తీవ్ర ప్రభావం

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం ఫ్రాన్స్ పశ్చిమ, ఉత్తర , తూర్పు ప్రాంతాల రైల్వే లైన్లు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల ప్రభావం డొమెస్టిక్ రైళ్ల పైన మాత్రం కాదు ఛానల్ టన్నెల్ ద్వారా వెళ్ళే పొరుగు దేశాలైన బెల్జియం, లండన్ లకు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం ప్రకారం ఈ విధ్వంసం, దహనం కారణంగా జరిగిన నష్టాన్ని సరిచేయడానికి కనీసం ఆదివారం వరకు పట్టవచ్చు.

జాతీయ పోలీసుల సూచన మేరకు ఫ్రెంచ్ అధికారులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. SNCF ఈ సంఘటనలను ‘హానికరమైన చర్యలు’గా అభివర్ణించింది. అంతకు మించి ఈ విధ్వంసం గురించి వివరాలను అందించలేదు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనను ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాల్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాల్సి ఉంది.. అయితే పారిస్ ఒలింపిక్స్‌ నిర్వహణకు దీనికి ప్రత్యక్ష సంబంధం ఉందా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా లేదు.

8 లక్షల మంది రైల్వే ప్రయాణికులపై ప్రభావం

ది గార్డియన్ నివేదిక ప్రకారం ఈ హింసపై ఫ్రాన్స్ క్రీడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైనది చర్యగా అభివర్ణించారు. క్రీడలను లక్ష్యంగా చేసుకోవడం ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో సమానమని ఆయన ఉద్ఘాటించారు. అదే సమయంలో ఫ్రాన్స్ రవాణా మంత్రి రైలు నెట్‌వర్క్‌పై ఈ దాడులను ఘోరమైన నేరంగా అభివర్ణించారు. దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులు దీని బారిన పడ్డారని ఎస్‌ఎన్‌సిఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్-పియర్ చెప్పారు.

సెయిన్ నది తీరంలో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఫ్రాన్స్‌లో అపూర్వమైన రీతిలో జరగబోతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం మొత్తం ఈఫిల్ టవర్, సీన్ నది సమీపంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌లో 10500 మంది క్రీడాకారులు పాల్గొంటారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రేక్షకులు, అతిథులు హాజరుకానున్నారు. ఒలింపిక్ క్రీడలు 1896లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రారంభ వేడుకలు వివిధ స్టేడియంల్లో జరిగాయి. స్టేడియం వెలుపల ఈ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఫ్రాన్స్ రైలు నెట్‌వర్క్‌పై జరిగిన ఈ దాడి ప్రారంభ వేడుకపై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..