Pak Cricketer: టీమిండియా బ్యాటింగ్ విభాగం బలంగా ఉండటానికి అతనే కారణం.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

Pak Cricketer: పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సేహ్వాగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

Pak Cricketer: టీమిండియా బ్యాటింగ్ విభాగం బలంగా ఉండటానికి అతనే కారణం.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
Cricket
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2021 | 10:47 PM

Pak Cricketer: పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సేహ్వాగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సేహ్వాగ్ తన బ్యాటింగ్ శైలితో భారత బ్యాటింగ్ సర్వూపాన్నే మార్చేశాడని కితాబిచ్చాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లో వీరేంద్ర సేహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కాగా, సేహ్వాగ్ బ్యాటింగ్ శైలి.. టెస్ట్ గానీ, వన్డే గానీ, టీ20 మ్యాచ్ ఏదైనా దూకుడుగా ఉంటుంది. ఆ దూకుడు ప్రదర్శనతో క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లలో, సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 82.2, వన్డేల్లో స్ట్రైక్ రేట్ 104.3, టి20 స్ట్రైక్ రేట్ 145.3. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సక్లైన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడం ద్వారానే సేహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు.

అయితే, ప్రస్తుతం ఉన్న టీమిండియా ప్లేయర్ల బ్యాటింగ్‌ శైలికి వీరేంద్ర సేహ్వాగ్ కారణం అని సక్లైన్ అభిప్రాయ పడ్డాడు. సేహ్వాగ్ బ్యాటింగ్ శైలి యావత్ క్రికెట్ ప్రపంచంపై విపరీతమైన ప్రభావం చూపిందన్నారు. సేహ్వాగ్ ఆట తీరు.. భారత్‌ను క్రికెట్ బ్రాండ్‌గా మార్చేసిందన్నారు. చాలా మంది ఆటగాళ్లకు సేహ్వాగ్ మార్గదర్శనంగా నిలిచారని అన్నారు. అతని ఆట తీరును చూసే బ్యాట్స్‌మెన్ మనస్తత్వం కూడా మారిందన్నారు.

ఇదిలాఉంటే.. సేహ్వాగ్, రోహత్ శర్మల ఆట తీరును పోలుస్తూ సక్లైన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రోహిత్ శర్శ ట్రాక్ రికార్డ్ సేహ్వాగ్ కంటే మెరుగ్గా ఉంటుందన్న సక్లైన్.. సేహ్వాగ్‌ను అనుసరించడం మాత్రం రోహిత్ శర్మకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. సేహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్ కొద్ది మందికి మాత్రమే సాధ్యం అని సక్లైన్ అభిప్రాయపడ్డాడు.

సెహ్వాగ్ తన విశ్వాసంతో ఇతరులకు మార్గం చూపించాడని కొనియాడాడు. వన్డేల్లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి రోహిత్ శర్మకు మార్గదర్శనంగా మారాడాని అన్నారు. సేహ్వాగ్‌ను చూసి రోహిత్ ఇంకా చాలా నేర్చుకోవాలని అన్నారు.

Also read:

Indian Railways: దేశవ్యాప్తంగా 15 నగరాల్లో రైల్వే స్టేడియంలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రారంభం అయిన సన్నాహాలు