Atchannaidu : జగన్ హయాంలో వ్యవస్థలు నాశనమవుతున్నాయి, ఏపీ ర్యాంకు 6కి పడిపోయింది : అచ్చెన్నాయుడు

సుస్తిరాభివృద్ధి కేటగిరిలో ఏపీ 2వ ర్యాంక్ నుంచి 6కు పడిపోయిందని..

Atchannaidu : జగన్ హయాంలో వ్యవస్థలు నాశనమవుతున్నాయి, ఏపీ ర్యాంకు 6కి పడిపోయింది : అచ్చెన్నాయుడు
Achhennaidu
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 04, 2021 | 10:34 PM

TDP AP President Atchannaidu : టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేశారని విమర్శించిన అచ్చెన్న.. సుస్తిరాభివృద్ధి కేటగిరిలో ఏపీ 2వ ర్యాంక్ నుంచి 6కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో 3వ ర్యాంక్‌లో ఉన్న రాష్ట్రాన్ని 19కి తీసుకొచ్చారని ఈ ఘనత జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారుదని ఆయన ఎద్దేవా చేశారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా 3 శాతం వెనుకబడ్డారని అచ్చెన్న తప్పుబట్టారు. నాడు-నేడు అంటూ ఊదరగొట్టిన జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు.

Read also : Gautam Sawang : కరోనా వేళ పౌర సమాజం, ఎన్జీవోల అమూల్యమైన సమాజ సేవలను “మానవత్వ ధీర” గా గుర్తిస్తాం : ఏపీ డీజీపీ