AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026 : ఖేలో ఇండియా మిషన్.. రాబోయే 10 ఏళ్ల కోసం నిర్మలమ్మ మాస్టర్ ప్లాన్.. ఇక ఆటగాళ్లకు పండగే

Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27లో క్రీడా రంగానికి భారీ కేటాయింపులు జరిగాయి. దేశంలో క్రీడలను కేవలం వినోదంగానో, పతకాలు గెలిచే వనరుగానో చూడకుండా.. ఒక ఆర్థిక శక్తిగా, ఉపాధి మార్గంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది.

Budget 2026 : ఖేలో ఇండియా మిషన్.. రాబోయే 10 ఏళ్ల కోసం నిర్మలమ్మ మాస్టర్ ప్లాన్.. ఇక ఆటగాళ్లకు పండగే
Budget
Rakesh
|

Updated on: Feb 01, 2026 | 6:27 PM

Share

Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27లో క్రీడా రంగానికి భారీ కేటాయింపులు జరిగాయి. దేశంలో క్రీడలను కేవలం వినోదంగానో, పతకాలు గెలిచే వనరుగానో చూడకుండా.. ఒక ఆర్థిక శక్తిగా, ఉపాధి మార్గంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసారి బడ్జెట్‌లో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు సుమారు రూ.45,482 కోట్లు కేటాయించడం విశేషం.

బడ్జెట్ 2026లో క్రీడా రంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రకటన ఖేలో ఇండియా మిషన్. ఈ మిషన్ ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే కాకుండా, క్రీడల ద్వారా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిని సాధించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయి నుంచి ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు అత్యాధునిక ఫిట్‌నెస్ సెంటర్లు మరియు ట్రైనింగ్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ బడ్జెట్‌లో క్రీడాకారులకే కాకుండా, వారికి శిక్షణ ఇచ్చే కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పోర్ట్స్ సైన్స్, లేటెస్ట్ టెక్నాలజీని క్రీడల్లోకి తీసుకురావడం ద్వారా భారతీయ ఆటగాళ్లను గ్లోబల్ ఛాంపియన్లుగా మార్చాలని నిర్మలమ్మ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రత్యేక నిధులను కేటాయించడమే కాకుండా, క్రీడలను ఒక కెరీర్‌గా ఎంచుకునే యువతకు భరోసా కల్పించేలా పథకాలను రూపొందించారు.

క్రీడా ప్రేమికులకు మరో శుభవార్త ఏమిటంటే.. త్వరలో క్రీడా సామాగ్రి ధరలు తగ్గే అవకాశం ఉంది. భారతదేశాన్ని క్రీడా పరికరాల తయారీకి గ్లోబల్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.10,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల దేశీయంగా క్రికెట్ బ్యాట్లు, బాల్స్, బ్యాడ్మింటన్ రాకెట్లు, ఫుట్‌బాల్స్ వంటి పరికరాల ఉత్పత్తి పెరుగుతుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గి, స్థానికంగా తయారయ్యే క్రీడా సామాగ్రి తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి రానుంది. మొత్తం మీద ఈ బడ్జెట్ భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికేలా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..