AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Praggnanandhaa: ఇదంతా ఆమె వల్లే.. 3 ఏళ్ల నుంచే మొదలుపెట్టా: ప్రజ్ఞానంద

R Praggnanandhaa: చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద 2018లో ప్రతిష్టాత్మక గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను ఈ ఘనత సాధించిన భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆ సమయంలో ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగానూ రికార్డులను సాధించాడు. అత్యంత పిన్న వయస్కులైన గ్రాండ్‌మాస్టర్‌ల జాబితాలో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. భారతదేశపు దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అతనికి మార్గనిర్దేశం చేశాడు.

R Praggnanandhaa: ఇదంతా ఆమె వల్లే.. 3 ఏళ్ల నుంచే మొదలుపెట్టా: ప్రజ్ఞానంద
Praggnanandhaa Vaishali
Venkata Chari
|

Updated on: Aug 25, 2023 | 9:56 AM

Share

R Praggnanandhaa: తన సోదరి అభిరుచితో ప్రభావితమైన ప్రజ్ఞానంద.. చాలా చిన్న వయస్సులోనే చెస్‌ను తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాడు. ఆడుకునే వయస్సులో ఆట మెళకువలు నేర్చుకున్నాడు. ప్రజ్ఞానంద కేవలం 3 సంవత్సరాల వయస్సులో ఆటలో లీనమయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందను భారత చెస్ భవిష్యత్తుగా పరిగణిస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన టైబ్రేక్ మ్యాచ్‌లో కార్ల్‌సెన్ 1-0 తేడాతో FIDE ప్రపంచ కప్ 2023ని గెలుచుకున్నాడు. భారత ఆటగాడు రన్నరప్‌గా నిలిచాడు. అయితే, ప్రపంచ నంబర్ వన్‌కు చుక్కలు చూపించి, కడదాకా పోరాడాడు. ఓడినా అందరి మనసులను గెలచుకున్న ప్రజ్ఞానందకు దేశ వ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి.

2016లో, కేవలం 10 సంవత్సరాల ఆరు నెలల వయస్సులోప్రాగు (స్నేహితులు, కోచ్‌లు అతన్ని ముద్దుగా పిలుచే పేరు) అంతర్జాతీయ మాస్టర్‌గా మారాడు. అతను చెస్‌లో భారతదేశ భవిష్యత్తుగా ప్రచారం పొందాడు. 2022లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి, తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రజ్ఞానంద సాధించిన ఈ ఘనత చాలా పెద్దది. ముఖ్యంగా విశ్వనాథన్ ఆనంద్, పి హరికృష్ణ తర్వాత డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్‌ను ఓడించిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ప్రజ్ఞానందకు దక్కిన ప్రైజ్ మనీ..

చాలా మంది పిల్లలు జీవితంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని సమయంలో ప్రజ్ఞానంద చదరంగం ప్రయాణం మొదలైంది. బ్యాంకులో పనిచేస్తున్న పోలియో బాధిత తండ్రి రమేష్ బాబు, తల్లి నాగలక్ష్మిలు.. ప్రజ్ఞానంద అక్క వైశాలి టీవీ చూస్తూ కాలం వెళ్లదీస్తోందని వాపోయారు. వైశాలిని చెస్‌తో కనెక్ట్ చేయడం వెనుక కారణం ఆమెకు ఇష్టమైన కార్టూన్ షో నుంచి ఆమెను దూరంగా ఉంచడమే. వైశాలిని చూసి ప్రజ్ఞానంద కూడా ఆసక్తి కలుగుతుందని, ఈ గేమ్‌లో పేరు తెచ్చుకుంటాడని అప్పటికి వారికి కూడా తెలియదు.

ఈ క్రమంలో ఓసారి ప్రజ్ఞానంద తండ్రి రమేష్ బాబు మాట్లాడుతూ “వైశాలి టీవీ చూసే సమయాన్ని తగ్గించడానికి మేం చెస్‌ను పరిచయం చేశాం. పిల్లలిద్దరూ ఈ గేమ్‌ని ఇష్టపడి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ గేమ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా, వారు ఆటను ఆస్వాదిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

రన్నర్ గా నిలిచిన ప్రజ్ఞానంద..

తల్లి నాగలక్ష్మి టోర్నమెంట్‌కి వారిద్దరితో పాటు ఇంట్లో ఉంటూ వారి మ్యాచ్‌లను చూస్తూ ఉంటుంది. రమేష్‌బాబు మాట్లాడుతూ, “టోర్నమెంట్‌లకు తనతో పాటు వెళ్లి ఎంతో సపోర్ట్ చేస్తున్న ఘనత నా భార్యకే చెందుతుంది. ఆమె ఇద్దరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది” అని తెలిపాడు.

మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి (19) ఒక టోర్నమెంట్ గెలిచిన తర్వాత చెస్‌పై ఆసక్తి పెరిగిందని, ఆ తర్వాత తన తమ్ముడు కూడా ఆటను ఇష్టపడటం ప్రారంభించాడని తెలిపింది. ఆమె మాట్లాడుతూ, “నాకు ఆరేళ్ల వయసులో, నేను చాలా కార్టూన్లు చూసేదానిని. నేను టెలివిజన్‌కు అతుక్కోకూడదని మా తల్లిదండ్రులు కోరుకున్నారు. నన్ను చెస్, డ్రాయింగ్ తరగతుల్లో చేర్చారు” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి..

చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద 2018లో ప్రతిష్టాత్మక గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను ఈ ఘనత సాధించిన భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆ సమయంలో ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగానూ రికార్డులను సాధించాడు. అత్యంత పిన్న వయస్కులైన గ్రాండ్‌మాస్టర్‌ల జాబితాలో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. భారతదేశపు దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అతనికి మార్గనిర్దేశం చేశాడు.

గ్రాండ్‌మాస్టర్ అయిన తర్వాత ప్రజ్ఞానంద స్థిరమైన పురోగతిని సాధించాడు. అయితే ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నమెంట్‌లు ఆగిపోయాయి. టోర్నమెంట్‌ల మధ్య సుదీర్ఘ విరామం అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. అయితే ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌లైన్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌పై విజయం అతనికి చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

ప్రగానానందకు క్రికెట్ అంటే ఇష్టమని, సమయం దొరికినప్పుడల్లా మ్యాచ్ ఆడేందుకు వెళ్తాడని వైశాలి తెలిపింది. ప్రజ్ఞానంద ఆనంద్‌కి పెద్ద అభిమాని, తాను ప్రపంచ ఛాంపియన్‌గా మారడం గురించి మాట్లాడుతుంటాడని ఆమె పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..