AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2021: లీగ్ మ్యాచుల్లో ఘనం.. ప్లేఆఫ్‌లో విఫలం.. సీజన్‌ 8లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన తెలుగు టైటాన్స్

Pro Kabaddi Season 8: ప్రొ-కబడ్డీ రెండు సీజన్‌లలో తెలుగు టైటాన్స్ టైటిల్‌కు చేరువైంది. కానీ, ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. దీంతో తొలి టైటిల్‌ కోసం టీమ్‌ ఆశగా ఎదురుచూస్తోంది.

PKL 2021: లీగ్ మ్యాచుల్లో ఘనం.. ప్లేఆఫ్‌లో విఫలం.. సీజన్‌ 8లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన తెలుగు టైటాన్స్
Pro Kabaddi Season 8 Telugu Titans Stats
Venkata Chari
|

Updated on: Dec 22, 2021 | 11:17 AM

Share

Telugu Titans Stats: ప్రో కబడ్డీ లీగ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. రెండేళ్ల తర్వాత కబడ్డీలో ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్‌లను అభిమానులు చూడనున్నారు. ప్రో-కబడ్డీ లీగ్‌లో రెండుసార్లు టైటిల్‌కు చేరువైన తెలుగు టైటాన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ టీమ్ ప్రయాణం చాలా హెచ్చుతగ్గులను చూసింది. అయితే గత సీజన్‌లో ఆ జట్టు నిరాశపరిచింది. ఇప్పటివరకు జట్టు ప్రయాణం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

ఇప్పటివరకు జట్టు ప్రయాణం ఎలా ఉందంటే? ప్రో-కబడ్డీ లీగ్ మొదటి సీజన్ నుంచి తెలుగు టైటాన్స్ జట్టు అనుబంధంగా ఉంది. తొలి సీజన్‌లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలవగలిగింది. రెండో సీజన్‌లో జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో 16 మ్యాచ్‌ల్లో 9 గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకుంది. కానీ, ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మూడో సీజన్‌లో ఆ జట్టు పరాజయం పాలైంది. నాల్గవ సీజన్‌లో మాత్రం మరోసారి మంచి పునరాగమనం చేసి 16 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించి ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే ఈసారి కూడా ఆ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. దీని తర్వాత జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. గత సీజన్‌లో, జట్టు 22 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లను మాత్రమే గెలవగలిగింది. ఏడో సీజన్‌లో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో కొనసాగింది.

ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి.. ఈసారి తెలుగు టైటాన్స్ కమాండ్ రోహిత్ కుమార్ చేతిలో ఉంది. గత సీజన్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత ఈసారి మెరుగైన రీతిలో తిరిగి రావాలని జట్టు కోరుకుంటోంది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ టైటిల్‌ను గెలవలేదు. అటువంటి పరిస్థితిలో, ఆటగాళ్లు చారిత్రక ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తారు. ఈసారి తెలుగు టైటాన్స్ ఎంత వరకు చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సీజన్ 8 కోసం తెలుగు టైటాన్స్ స్క్వాడ్.. రైడర్స్: మూల శివ గణేష్ రెడ్డి, రాకేష్ గౌడ, అమిత్ కుమార్, గుర్విందర్ సింగ్, సూరజ్ దేశాయ్, సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్, అంకిత్ బెనివాల్, కమల్ సింగ్, రజనీష్, అబోజర్ మిఘాని

డిఫెండర్లు: విశాల్ భరద్వాజ్, సి అరుణ్, కృష్ణ మదన్, మనీష్, ఆకాష్ చౌదరి

ఆల్ రౌండర్లు: డేవిట్ జెన్నింగ్స్, అర్మాన్, ఫర్హాద్ రహీమి

Also Read: Watch Video: ‘గబ్బర్’ డైలాగ్‌కు శిఖర్ ధావన్ యాక్షన్.. వైరలవుతోన్న వీడియో

PKL 2021: నాలుగేళ్లుగా వరుస వైఫల్యాలు.. ప్లేఆఫ్‌ చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమణ.. తొలి పోరుకు సరికొత్తగా సిద్ధం..!

Pro Kabaddi League: కబడ్డీ కూతకు వేళాయే.. సరికొత్తగా రీఎంట్రీ.. వారికి మాత్రం నోఛాన్స్.. తొలి పోరులో తలపడేది ఎవరంటే?