PKL 2021-22 Highlightss: టైగా ముగిసిన మ్యాచ్‌.. అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్‌..

Narender Vaitla

|

Updated on: Dec 22, 2021 | 9:56 PM

Telugu Titans vs Tamil Thalaivas Live: క్రీడా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ ప్రొ కబడ్డీ మళ్లీ వచ్చేసింది. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ వస్తోన్న కబడ్డీ లీగ్‌ కోసం వేచి చూసిన వారందరి నిరీక్షణకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ బుధవారం..

PKL 2021-22 Highlightss: టైగా ముగిసిన మ్యాచ్‌.. అద్భుత ఆటతీరు కనబరిచిన తెలుగు టైటాన్స్‌..

Telugu Titans vs Tamil Thalaivas Match Highlights: తమిళ్‌ తలైవాస్‌, తెలుగు టైటాన్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ టై గా ముగిసింది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌ చివరికి టైగా ముగిసింది. ముఖ్యంగా తెలుగు టైటాన్స్‌ ఓటమి చివరి వరకు వెళ్లి మళ్లీ మంచి కమ్‌బ్యాక్‌తో చెలరేగిపోయింది. ఒకానొక సమయంతో తమిళ్‌ తలైవాస్‌ 38 పాయింట్లు, తెలుగు టైటాన్స్‌ 29 పాయింట్లతో ఉంది. ఇక తెలుగు టైటాన్స్‌ ఓటమి ఖరారు అని అందరూ అనుకుంటోన్న సమయంలో. తెలుగు ప్లేయర్స్‌ ఒక్కసారిగా రెచ్చిపోయారు.

కేవలం ఐదు నిమిషాల్లోనే ఆట స్వరూపాన్ని మార్చేశారు. 5 నిమిషాల్లో 10 పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అలా చివరికి ఒక్క పాయింట్‌ తేడా ఉన్న సమయంలో చివరి పాయింట్‌ను తెలుగు టైటాన్స్‌ను సాధించి మ్యాచ్‌ను టైగా ముగించేసింది. ఇలా పరాజయాన్ని అధిగమించారు తెలుగు ప్లేయర్స్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2021 09:53 PM (IST)

    సూపర్‌ మ్యాచ్‌.. ఓటమిని జయించిన తెలుగు టైటాన్స్‌..

    తమిళ్‌ తలైవాస్‌, తెలుగు టైటాన్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ టై గా ముగిసింది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌ చివరికి టైగా ముగిసింది. ముఖ్యంగా తెలుగు టైటాన్స్‌ ఓటమి చివరి వరకు వెళ్లి మళ్లీ మంచి కమ్‌బ్యాక్‌తో చెలరేగిపోయింది. ఒకానొక సమయంతో తమిళ్‌ తలైవాస్‌ 38 పాయింట్లు, తెలుగు టైటాన్స్‌ 29 పాయింట్లతో ఉంది. ఇక తెలుగు టైటాన్స్‌ ఓటమి ఖరారు అని అందరూ అనుకుంటోన్న సమయంలో. తెలుగు ప్లేయర్స్‌ ఒక్కసారిగా రెచ్చిపోయారు.

    కేవలం ఐదు నిమిషాల్లోనే ఆట స్వరూపాన్ని మార్చేశారు. 5 నిమిషాల్లో 10 పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అలా చివరికి ఒక్క పాయింట్‌ తేడా ఉన్న సమయంలో చివరి పాయింట్‌ను తెలుగు టైటాన్స్‌ను సాధించి మ్యాచ్‌ను టైగా ముగించేసింది. ఇలా పరాజయాన్ని అధిగమించారు తెలుగు ప్లేయర్స్‌.

  • 22 Dec 2021 09:38 PM (IST)

    చెలరేగి ఆడుతోన్న తమిళ్‌ తలైవాస్‌..

    తమిళ్‌ తలైవాస్‌ దూకుడుగా ఆడుతున్నారు. మ్యాచ్‌ ఇంకా కేవలం 5 నిమిషాలే మిగిలి ఉన్న సమయంలో తమిళ్‌ తలైవాస్‌ 38 పాయింట్లతో దూసుకుపోతుండగా తెలుగు టైటాన్స్‌ 29 పాయింట్లతో వెనుకంజలో ఉంది.

  • 22 Dec 2021 09:07 PM (IST)

    హాఫ్‌ టైమ్‌ ముగిసే సమయానికి లీడ్‌లో తమిళ్‌ తలైవాస్‌..

    తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఇరుజట్లు మంచి ఆటను కనబరిచారు. ఈ క్రమంలోనే నువ్వునేనా అన్నట్లు సాగిన ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్‌ 21, తమిళ్‌ తలైవాస్‌ 23 పాయింట్లతో ఉన్నారు.

  • 22 Dec 2021 08:57 PM (IST)

    దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్‌..

    తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ దూసుకుపోతున్నారు. వరుస పాయింట్లు దక్కించుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 8 నిమిషాల సమయానికి తెలుగు టైటాన్స్‌ ఏకంగా 17 పాయింట్లతో దూసుకుపోతుండగా, తమిళ్‌ తలైవాస్‌ మాత్రం 09 పాయింట్ల వద్దే ఉన్నారు.

  • 22 Dec 2021 08:40 PM (IST)

    తమిళ్ తలైవాస్‌..

    పర్పంజన్, మంజీత్, ఎంఎస్ అతుల్, భవానీ రాజ్‌పుత్, సాగర్, హిమాన్షు, ఎం అభిషేక్, మహ్మద్ తుహిన్, సుర్జిత్ సింగ్, మహ్మద్ తరదీ, సాహిల్, అన్వర్ సాహిబ్, సౌరభ్ తానాజీ, సాగర్ కృష్ణ, సంతపన్‌సెల్వం

  • 22 Dec 2021 08:37 PM (IST)

    తెలుగు టైటాన్స్‌ టీమ్..

    రోహిత్‌ కుమార్‌ (కెప్టెన్‌), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (వైస్‌ కెప్టెన్‌), రజ్‌నిష్‌ దలాల్‌, రాకేశ్‌ గోవాడ, గల్ల రాజు, అంకిత్‌ బెనివాల్‌, అమిత్‌ చౌహాన్‌, హ్యూన్సూ పార్క్‌, సురిందర్‌ సింగ్‌, రుతురాజ్‌ కొరవి, సందీప్‌ కండోలా, సీ అరుణ్‌, ఆకాశ్‌ అర్సుల్‌, ఆదర్శ్‌, ఆకాశ్‌ చౌదరీ, మనిష్‌, ప్రిసన్స్‌ అబే టెస్ట్రో

Published On - Dec 22,2021 8:26 PM

Follow us