World Cadet Championship: ప్రధానిని మెప్పించిన డబ్ల్యూసీసీ టీం.. 5 స్వర్ణాలతో సహా 13 పతకాలు సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లు

అమన్ ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. 48 కేజీల విభాగంలో ఫైనల్లో అమన్ 5-2 తేడాతో అమెరికన్ రెజ్లర్ లూక్ జోసెఫ్ లిల్డాల్‌ను ఓడించి బంగారు పతకాన్ని సాధించాడు.

World Cadet Championship: ప్రధానిని మెప్పించిన డబ్ల్యూసీసీ టీం.. 5 స్వర్ణాలతో సహా 13 పతకాలు సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లు
World Cadet Championships In Budapest
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2021 | 11:11 AM

World Cadet Championship: హంగరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 5 స్వర్ణాలతో సహా 13 పతకాలు సాధించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ భారత టీంను అభినందిస్తూ ట్వీట్ చేశారు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 5 స్వర్ణాలతో సహా మొత్తం 13 పతకాలు సాధించిందని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. భారత బృందానికి అభినందనలు, వారు భవిష్యత్‌లో మరింత ముందుకుసాగాలంటూ అభినందనలు తెలిపారు.

ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 75 కిలోల బరువు విభాగంలో భారత మహిళా క్రీడాకారిణి ప్రియా మాలిక్ బంగారు పతకం సాధించింది. ప్రియ 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది. ప్రియా 2019 లో పూణేలోని ఖేలో ఇండియాలో బంగారు పతకాన్ని, 2019 లో ఢిల్లీలో 17 వ పాఠశాల క్రీడలలో బంగారు పతకాన్ని, 2020 లో పాట్నాలో జరిగిన జాతీయ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే ప్రియా మాలిక్ 2020లో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించింది.

అమన్ తొలి బంగారు పతకాన్ని అందించాడు అమన్ ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. 48 కేజీల విభాగంలో ఫైనల్లో అమన్ 5-2 తేడాతో అమెరికన్ రెజ్లర్ లూక్ జోసెఫ్ లిల్డాల్‌ను ఓడించి భారత బంగారు పతక ఖాతాను ప్రారంభించాడు. అమన్ ఈ టోర్నమెంట్‌ ఆసాంతం ఆధిపత్యం చెలాయించాడు. అమెరికన్ ఆటగాడు అమన్ కంటే ఎత్తుగా ఉన్నా.. అమన్ ధైర్యంగా ఎదుర్కొని దాడి చేసి విజయం సాధించాడు. అలాగే సాగర్ 80 కిలోల విభాగంలో రెండవ విజయాన్ని సాధించింది. సాగర్ జేమ్స్ మోక్లర్ రౌలీని 4-0తో ఓడించి భారత్‌కు రెండవ స్వర్ణ పతకాన్ని అందించాడు.

Also Read:

Tokyo Olympics 2020 Live: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ రాంకిరెడ్డి జోడీ ఓటమి..!

Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ జట్టు.. కొరియాతో సమరానికి సిద్ధం

IND vs SL: అరంగేట్రంలోనే చెత్త రికార్డ్.. గోల్డెన్ డక్‌లో మరో టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా..!