32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, నేడు రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ

ఇవాళ, (సోమవారం) రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా..

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు,  నేడు రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 01, 2021 | 6:05 AM

ఇవాళ, (సోమవారం) రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రోడ్డ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ భారీ బైక్ ర్యాలీ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం నుంచి ప్రారంభమమై, విక్టోరియా మెమోరియల్‌ మీదుగా సరూర్‌నగర్‌ మెమోరియల్‌ స్టేడియం చేరుకుంటుంది. ఈ ఏడాదిని యాక్సిడెంట్‌ ఫ్రీ ఈయర్‌గా చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహమూ ద్‌ అలీ, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సబిత ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతున్నారు.