Viral Video: హృదయాలను కదిలించిన వీడియోకాల్.. భావోద్వేగాన్ని భార్యతో పంచుకున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్..!
ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా టీం తన కలను నెరవేర్చుకుని 1-0తేడాతో బ్రెజిల్ పై గెలిచి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసింది. ఈ మేరకు మ్యాచ్ అనంతరం స్టార్ ప్లేయర్ తన భార్య ఆంటోనెల్లా రోకుజోనుకు వీడియో కాల్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
Copa America final: ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా టీం తన కలను నెరవేర్చుకుని 1-0తేడాతో బ్రెజిల్ పై గెలిచి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసింది. ఈ మేరకు మ్యాచ్ అనంతరం స్టార్ ప్లేయర్ తన భార్య ఆంటోనెల్లా రోకుజోనుకు వీడియో కాల్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అర్జెంటీనా టీం 1993 నుంచి కోపా అమెరికా కప్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ, సాధ్యం కాలేదు. అయితే, ఆదివారం మారకానా స్టేడియంలో జరిగిన ఫైనల్లో మాత్రం లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు విజయం సాధించి, కప్ ను గెలుచుకుంది. మొదటి అంతర్జాతీయ కప్ ను అందుకున్న ఆనందాన్ని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ తన భార్యతో పంచుకున్నాడు. ఆదివారం ఆట ముగిసిన అనంతరం స్టేడియం మధ్యలో నిల్చుని, తన భార్య ఆంటోనెల్లా రోకుజోను వీడియో కాల్ చేసి మెడలోని పతకాన్ని చూపిస్తూ మురిసిపోయాడు.
ఈ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు 1-0 తేడాతో బ్రెజిల్ పై గెలిచి, 28 సంవత్సరాల కలను నెరవేర్చుకుంది. అర్జెంటీనా ఆటగాడిగా మెస్సీ ఎన్నో రికార్డులు నెలకొల్పినా.. అర్జెంటీనాకు మాత్రం ఓ అంతర్జాతీయ కప్ ను అందించలేకపోయాడు. దాంతో తొలిసారి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ ను అందుకుంది. అయితే ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూడలేకపోయిన తన కుంటానికి తన విజయాన్ని, ఆనందాన్ని పంచుకోవాలనుకన్న మెస్సీ, వెంటనే వీడియో కాల్ చేశాడు. తన ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి వీడియోకాల్ లో మాట్లాడాడు. తన మెడలోని పతకాన్ని చూపిస్తూ ఎంతో సంతోషంతో మురిసిపోయాడు. అవతలి నుంచి తన భార్య, పిల్లలు కూడా ఈలలు వేస్తూ సంతోషంతో డ్యాన్సలు చేశారు. మెస్సీ కుటుంబం ప్రస్తుతం బార్సిలోనాలోని క్యాంప్ నౌలో నివసిస్తున్నారు. కరోనా ఆంక్షలతో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడలేకపోయినందుకు తన సంతోషాన్ని ఇలా చూపించాలని అనుకున్నాడు. ఈ వీడియోను కోపా అమెరికా ట్విట్టర్లో షేర్ చేసింది.
వీడియోకాల్ అనంతరం మెస్సీ భార్య ఆంటోనెల్లా రోకుజోను ఇన్ స్టాగ్రామ్ లో తన పిల్లలు ఆనందంతో గెంతులేస్తున్న వీడియోను పంచుకుంది. పోస్ట్ చేసి కొద్ది గంటల్లోనే ఈ వీడియో మూడు మిలియన్లకు పైగా య్యూస్ తో దూసుకపోతోంది. ఈమేరకు’మీ ఆనందం నాది! అభినందనలు, నా ప్రియమైన మెస్సీ’ అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో మెస్సీ ముగ్గురు పిల్లలు థియాగో, మాటియో, సిరో డ్యాన్సులతో తండ్రికి అభినందనలు తెలిపారు. వామోస్ అర్జెంటీనా పేరుతో ఈ వీడియోను పంచుకుంది. కోపా అమెరికా ట్రోఫీతో అంతర్జాతీయంగా తన సత్తా చాటింది అర్జెంటీనా టీం. చాలాకాలంగా దోబూచులాడున్న కోపా అమెరికా కప్ ను ఎట్టకేలకు మెస్సీ అందుకున్నాడు. దాంతో 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం మెస్సీ గోల్ చేయలేకపోయాడు. 22వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియో చేసిన గోల్ తోనే విజయం సాధించడం విశేషం. ఈ స్కోర్ ను సమం చేసేందుకు బ్రెజిల్ టీం చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
????#CopaAmérica#VibraElContinente#VibraOContinente pic.twitter.com/Av4B3knLms
— Copa América (@CopaAmerica) July 11, 2021
View this post on Instagram
Also Read: