Wimbledon 2021 : ఆరోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన నోవాక్ జొకోవిచ్.. ఫైనల్లో మాటియో బెరెట్టిపై ఘన విజయం..

wimbledon 2021 : నోవాక్ జొకోవిచ్ ఆరోసారి వింబుల్డన్ 2021 టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన మాటియో బెరెట్టిని

Wimbledon 2021 : ఆరోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన నోవాక్ జొకోవిచ్.. ఫైనల్లో మాటియో బెరెట్టిపై ఘన విజయం..
Novak Djokovic
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 12, 2021 | 11:06 AM

wimbledon 2021 : నోవాక్ జొకోవిచ్ ఆరోసారి వింబుల్డన్ 2021 టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన మాటియో బెరెట్టిని 6-7, 6-4, 6-4, 6-3 తేడాతో ఓడించాడు. ఈ విజయంతో నోవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషులలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవడంలో ఉమ్మడి నంబర్ వన్ అయ్యాడు. ఇప్పుడు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ మాదిరిగానే ఇతని పేరుపై 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. జొకోవిచ్ అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు.

తొలి సెట్‌ కోల్పోయినా… కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న బెరెటిని ఆరంభంలో తడబడ్డాడు. కెరీర్‌లో 30వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న జొకోవిచ్‌ నాలుగో గేమ్‌లో బెరెటిని సర్వీస్‌ను బ్రేక్‌ చేసి అదే జోరు కొనసాగించి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నెమ్మదిగా తేరుకున్న బెరెటిని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బెరెటిని పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్‌ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు.

ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌–20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్‌ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

UEFA Euro 2020: యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఇటలీ.. 1968 తర్వాత మరోసారి కప్‌ను సొంతం చేసుకున్న.

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. సిల్వర్‌ ధరల్లోనూ నో ఛేంజ్‌. సోమవారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇలా ఉంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే