FIFA World Cup 2022: వేలానికి ఫిఫా ట్రోఫీ.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.. మెస్సీ జెర్సీతో సహా 55 వస్తువులు కూడా..
FIFA World Cup Auction: లియోనెల్ మెస్సీ, మారడోనా జెర్సీతో సహా ఫుట్‌బాల్‌కు సంబంధించిన 55 వస్తువులు వేలం వేయనున్నారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్ బిడ్డింగ్ చేయవచ్చని తెలుస్తోంది.
FIFA World Cup Auction: దివంగత డియెగో మారడోనా, లియోనెల్ మెస్సీ ధరించిన జెర్సీతో పాటు 55 ఫుట్‌బాల్ సంబంధిత వస్తువులు, అలాగే ఫిఫా వరల్డ్ కప్ బంగారు పూతతో కూడిన ట్రోఫీని ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచారు. ఈ వేలం నెల ప్రారంభంలో ప్రారంభమైంది. డిసెంబర్ 22న ముగుస్తుంది. ఆదివారం అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య FIFA ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. నిర్వాహకులు ప్రపంచ కప్ ట్రోఫీ ప్రతిరూపాన్ని ఇవ్వడం ద్వారా ఫుట్‌బాల్ ఫీవర్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయనున్నారు.
వేలం నిర్వహించనున్న అర్జెంటీనా కంపెనీతో జూమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ప్రపంచ కప్ ఫీవర్‌ను సద్వినియోగం చేసుకొని, మేం ప్రపంచ కప్ ట్రోఫీ బంగారు పూతతో కూడిన ప్రతిరూపాన్ని విక్రయించాలని చూస్తున్నాం. అనేక జాతీయ జట్టు ట్రోఫీలు, జెర్సీలను వేలం వేయనున్నాం. వీటి ప్రారంభ ధర $9000(సుమారు రూ.7.50లక్షలు)లుగా నిర్ణయించాం” అంటూ చెప్పుకొచ్చారు.
ఖతార్‌లో లియోనెల్ మెస్సీ తన మ్యాజిక్‌ను ఆవిష్కరించడంతో కొంతమంది అదృష్ట విజేతలు అర్జెంటీనా సూపర్‌స్టార్‌ను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇందులో మారడోనా, మెస్సీ, మిలియన్ల మందిని ప్రేరేపించిన ఇద్దరు గొప్ప ఆటగాళ్ళ వస్తువులు కూడా ఉన్నారు. వారు ధరించిన జెర్సీలను వేలానికి పెట్టారు.
“ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఆడుతున్న అర్జెంటీనా ఆటగాళ్లు సంతకం చేసిన వాటితో సహా మెస్సీకి ఆరు జెర్సీలు ఉన్నాయి” అని రోడ్రిగ్జ్ తెలిపారు. అర్జెంటీనా జెర్సీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్లాడియో టాపియాకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం అందించారు. వేలం నుంచి ఫెర్నాండెజ్ హాస్పిటల్ విస్తరణతోపాటు, మరిన్ని సేవల కోసం ఈ డబ్బును ఉపయోగించనున్నారు. ఈ చొక్కా ప్రత్యేక పద్ధతిలో వేలానికి ఉంచనున్నారు. దీని ప్రారంభ ధర $5,500(అంటే సుమారు రూ. 4.60లక్షలు).”
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..