FIFA World Cup 2022 Final: ఒక్క మ్యాచ్‌తో ఎనిమిది రికార్డులను సృ‌ష్టించనున్న లియోనాల్ మెస్సీ..? ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌..

ఖతర్ వేదికగా జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2022’ టోర్నమెంట్  ముగింపు దశకు చేరుకుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య లూసెయిల్ స్టేడియంలో అదివారం(డిసెంబర్ 18) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ఫిఫా వరల్డ్ కప్..

FIFA World Cup 2022 Final: ఒక్క మ్యాచ్‌తో ఎనిమిది రికార్డులను సృ‌ష్టించనున్న లియోనాల్ మెస్సీ..? ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌..
Liomel Messi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 17, 2022 | 6:37 PM

ఖతర్ వేదికగా జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2022’ టోర్నమెంట్  ముగింపు దశకు చేరుకుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య లూసెయిల్ స్టేడియంలో అదివారం(డిసెంబర్ 18) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ముగిసినట్లే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకుంటే ఇప్పుడు వారి నాలుకల మీద ఉన్న ఒకే ఒక్క పేరు- అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ. ఎలా అయినా అర్జెంటీనా టీమ్ ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలవాలని, లియోనాల్ మెస్సీ తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌లో వినోదాత్మక గోల్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో అర్జెంటీనా, మెస్సీకి టోర్నమెంట్ టైటిల్ మాత్రమే ప్రాధాన్యత కాగా.. అభిమానులు మాత్రం ఫైనల్ ద్వారా వచ్చే ప్రత్యేక అవార్డులు, రికార్డుల మీదనే దృష్టి పెట్టారు.

ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరిగే ఫైనల్ పోరుతో ప్రపంచకప్ ఛాంపియన్ ఎవరో రేపు తేలిపోనుంది. 2018 ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచిన ఫ్రాన్స్.. 36 సంవత్సరాలుగా టైటిల్ కోసం ప్రయత్నిస్తోన్న అర్జెంటీనా రేపు హోరాహోరీగా పోరాడడానికి కూడా సిద్ధమయ్యాయి. ఇన్నాళ్లూ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన మెస్సీకి.. ఈ టైటిల్ గెలిచి చిరస్మరణీయ వీడ్కోలు ఇవ్వాలాని అర్జెంటీనా టీమ్ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈ ఫైనల్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య కొన్ని రికార్డులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

మెస్సీ, అర్జెంటీనా ముందు రికార్డు

  1. అర్జెంటీనా గెలిస్తే బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా తర్వాత 3 లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన నాలుగో దేశంగా ఆ టీమ్ అవతరిస్తుంది.
  2. ఇదే జరిగితే.. అర్జెంటీనా విజయంతో లియోనెల్ మెస్సీ పేరు కూడా డానియెల్ పసరెల్లా, డిగో మారడోనా సరసకు చేరుతుంది. ఈ ఇద్దరు మాజీ కెప్టెన్లు మాత్రమే అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించారు.
  3. అర్జెంటీనా గెలిస్తే.. 2006 నుంచి సాగుతున్న యూరప్ దేశాల ఆధిపత్యానికి తెరపడుతుంది. 2006, 2010, 2014, 2018 ఫిఫా వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లలో యూరోపియన్ జట్లే టైటిల్‌ను గెలుచుకున్నాయి. 2002లో టైటిల్ గెలుచుకున్న బ్రెజిల్.. చివరి దక్షిణ అమెరికా జట్టు.
  4. మెస్సీ దృష్టి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులపై ఉంది. ఈ అవార్డుల కోసం అతను ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాప్పేతో పోటీ పడనున్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు చెరో ఐదు గోల్స్ చేసి గోల్డెన్ బూట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్‌కు గోల్డెన్ బూట్ అందడం ఖాయం.
  5. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ అందుకున్న మెస్సీ గోల్డెన్ బాల్‌ను కూడా స్వాధీనం చేసుకోవడం దాదాపు ఖాయమైంది.  ఎందుకంటే మెస్సీ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 5 గోల్స్,  3 అసిస్ట్‌లు చేశాడు.  గోల్డెన్ బాల్‌ను మెస్సీ గెలిస్తే రెండుసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. మెస్సీ 2014లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
  6. ఈ ఫీఫా ప్రపంచ కప్‌ 2022లో మెస్సీ ఇప్పటివరకు 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని.. నెదర్లాండ్స్‌కు చెందిన వెస్లీ ష్నైడర్ (2010)తో సమానంగా ఉన్నాడు. మరో సారి అతను ఈ అవార్డును అందుకుంటే 5 సార్లు గెలుచుకున్న తొలి ఆటగాడిగా మెస్సీ నిలుస్తాడు.
  7. మెస్సీ ఈ ఫైనల్‌ మ్యాచ్ ఆడితే.. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. మెస్సీ ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి, జర్మన్ లెజెండ్ లోథర్ మథాస్‌తో సమానంగా ఉన్నాడు.
  8. మెస్సీ ఒక గోల్ చేస్తే, బ్రెజిలియన్ స్ట్రైకర్ పీలేతో సమానం అవుతాడు. ప్రపంచకప్‌లో పీలే 12 గోల్స్ చేయగా, మెస్సీ 11 గోల్స్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం