CCL: సీసీఎల్‌కు సర్వం సిద్దం.. ‘రోర్ ఆఫ్ ది లయన్స్’ పేరుతో న్యూస్ 9 డాక్యూమెంటరీ..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) పదో ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఫిబ్రవరి 23న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మధ్య బ్లాక్ బస్టర్ క్లాష్‌తో ప్రారంభమవుతుంది. ఎనిమిది చలనచిత్ర పరిశ్రమలకు చెందిన సూపర్‌స్టార్‌లతో కూడిన మొత్తం ఎనిమిది జట్లు పాల్గోననున్నాయి.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) పదో ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఫిబ్రవరి 23న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మధ్య బ్లాక్ బస్టర్ క్లాష్‌తో ప్రారంభమవుతుంది. ఎనిమిది చలనచిత్ర పరిశ్రమలకు చెందిన సూపర్‌స్టార్‌లతో కూడిన మొత్తం ఎనిమిది జట్లు పాల్గోననున్నాయి. ఈ సీసీఎల్ 10వ ఎడిషన్ 24 రోజుల పాటు ఆరు వేదికలలో జరుగనుంది. షార్జాలో మూడు మ్యాచ్‌లు జరిగిన తర్వాత, లీగ్ ఇండియా వేదికగా నిర్వహించనున్నారు. దీనికి హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో డిసెంబర్ 16న పంజాబ్ ఎడ్యుకేటర్స్‌పై PDS విజయం సాధించింది. పంజాబ్ డి షేర్ వర్సెస్ IRS ఆఫీసర్స్ XI మధ్య రెండవ గేమ్ జనవరి 27, శనివారం ముల్లన్‌పూర్ పంజాబ్‌లోని మహరాజ్ యాదవేందర్ సింగ్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. జనవరి 27న తలపడిన IRS ఆఫీసర్స్ తో తలపడిన పంజాబ్ XI టీం ఇలా ఉంది.
- గురుప్రీత్ ఘుగ్గీ
- బిన్ను ధిల్లాన్
- నింజా
- జాస్సీ గిల్
- బబ్బల్ రాయ్
- మన్మీత్ సింగ్ (మీట్ బ్రదర్స్)
- దేవ్ ఖరోడ్
- గవీ చానెల్
- సుయాష్ రాయ్
- దక్ష్ అజిత్ సింగ్
- మయూర్ మెహతా
- అనుజ్ ఖురానా
- రాహుల్ జైట్లీ
IRS ఆఫీసర్స్ XIతో ప్రాక్టీస్ మ్యాచ్ జనవరి 27న జరిగిన మ్యాచ్ TV9 నెట్‌వర్క్, న్యూస్9 ప్లస్ మీడియా భాగస్వాములుగా ఉన్నాయి. రాబోయే సీజన్‌లో CCL ఫ్రాంచైజీతో కలిసి పని చేయనున్నాయి.
TV9 నెట్‌వర్క్ క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం..
TV9 క్రికెట్ లీగ్‌తో లేదా ఫ్రాంచైజీతో సంబంధం కలిగి ఉండటం ఇదే మొదటిసారి కాదు. భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో అనుబంధాలను కలిగి ఉంది. IPL 2021కి ముందు, TV9 ‘యాక్షన్ రీప్లే బగ్’ కోసం స్టార్ స్పోర్ట్స్‌తో స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకం చేసింది.
న్యూస్9 ప్లస్ గురించి..
News9 Plus అనేది ప్రపంచంలోని మొట్టమొదటి వార్తల OTT ప్లాట్‌ఫారమ్, తాజా డాక్యుమెంటరీలు, ట్రెండింగ్ వార్తలు, ఆకర్షణీయమైన టాక్ షోలు , కనెక్ట్ చేయబడిన టీవీలు అన్ని సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న 24-గంటల వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం వన్-స్టాప్ డెస్టినేషన్. దీని తాజా అసోసియేషన్‌లో News9 ప్లస్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ డి షేర్ ఆధారంగా ‘రోర్ ఆఫ్ ది లయన్స్’ పేరుతో 4-ఎపిసోడ్ డాక్యుమెంట్-సిరీస్ రానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..