U19 World Cup 2024: హ్యాట్రిక్ విజయంతో సూపర్ సిక్స్ చేరిన భారత జట్టు.. 201 పరుగులతో తేడాతో ఓడిన అమెరికా

U19 World Cup 2024: U-19 ప్రపంచ కప్‌లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో, భారత యువ జట్టు USAపై 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ రౌండ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే భారత జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంది.

U19 World Cup 2024: హ్యాట్రిక్ విజయంతో సూపర్ సిక్స్ చేరిన భారత జట్టు.. 201 పరుగులతో తేడాతో ఓడిన  అమెరికా
India U 19 Beat Usa U 19
Follow us

|

Updated on: Jan 29, 2024 | 6:27 AM

అండర్-19 ప్రపంచ కప్ (U19 World Cup 2024)లో, తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో అమెరికాతో తలపడిన భారత యువ జట్టు (India U-19 vs USA U-19) 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ రౌండ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే భారత జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన ఉదయ్ సారథ్యంలోని భారత జట్టు.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు లీగ్‌లోని చివరి మ్యాచ్‌లో యుఎస్‌ఎపై 201 పరుగుల తేడాతో విజయం సాధించి తమ గ్రూప్‌లో అగ్రశ్రేణి జట్టుగా సూపర్ సిక్స్ దశలోకి ప్రవేశించింది.

110 బంతుల్లో సెంచరీ..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 110 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. తొలుత నిదానంగా బ్యాటింగ్ చేసిన అర్షిన్ 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు తన ఇన్నింగ్స్‌లో 118 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 7, 32 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన అర్షిన్.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో మళ్లీ ఫామ్‌ని అందుకున్నాడు.

155 పరుగుల భాగస్వామ్యం..

సెంచరీతో పాటు అర్షిన్ కులకర్ణి ముషీర్ ఖాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ముషీర్ మరోసారి అనూహ్య ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్ 35 పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా, ప్రియాంషు మోలియా 19 బంతుల్లో 27 పరుగులు, లోయర్ ఆర్డర్‌లో సచిన్ దాస్ 20 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అమెరికా తరపున అతింద్ర సుబ్రమణ్యం 2 వికెట్లు తీశాడు.

అమెరికా 125 పరుగులు..

326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు శుభారంభం లభించలేదు. ఆ జట్టులోని తొలి నలుగురు బ్యాటర్లు వరుసగా 2, 0, 18, 8 పరుగులకే పెవిలియన్ చేరి జట్టును ఆరంభంలోనే ఓటమిలోకి నెట్టారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ జట్టు తరపున అత్యధికంగా 40 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..