Red Ball Cricket: టెస్టు క్రికెట్‌పై శ్రద్ధ పెట్టకపోవడం నా బిగ్ మిస్టేక్.. కేకేఆర్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Kolkata Knight Riders: నితీష్ రాణా తన స్థావరాన్ని ఢిల్లీ నుంచి యూపీకి మార్చుకున్నాడు. అతను రాబోయే రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడాలని గతేడాది నిర్ణయించుకున్నాడు. నితీష్ రాణా ప్రస్తుతం యూపీ తరపున ఆడుతూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు.
Nitish Rana: ఉత్తరప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్న నితీశ్ రాణా (Nitish Rana) షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. గత రెండు సీజన్లలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడని నితీష్ రాణా ఈసారి యూపీ తరపున ఆడుతున్నాడు. నితీష్ రాణా ప్రకారం, కోవిడ్ సమయంలో, అతను తన దృష్టిని టెస్ట్ క్రికెట్ నుంచి కొంచెం మళ్లించాడు. ఇది అతని అతిపెద్ద తప్పుగా మారిందని ఎట్టకేలకు ఒప్పుకొన్నాడు.
నిజానికి, నితీష్ రాణా తన స్థావరాన్ని ఢిల్లీ నుంచి యూపీకి మార్చుకున్నాడు. అతను రాబోయే రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడాలని గతేడాది నిర్ణయించుకున్నాడు. నితీష్ రాణా ప్రస్తుతం యూపీ తరపున ఆడుతూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు.
ఈ మేరకు నితీష్ రాణా మాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్‌లో నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. కోవిడ్ సమయంలో రెడ్ బాల్ క్రికెట్ నుంచి తన దృష్టిని మళ్లించినందుకు పశ్చాత్తాపడుతున్నాను అంటే చెప్పుకొచ్చాడు.
‘జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రదర్శన చేయడం నాకు ఇష్టం. కోవిడ్ సమయంలో, IPL రెండు దశల్లో జరిగింది. నేను రెడ్ బాల్ క్రికెట్‌పై నా దృష్టిని కొంచెం మళ్లించాను. దీనివల్ల నేను చాలా వెనుకబడిపోయాను. ఈ సంవత్సరం నేను రెడ్ బాల్ క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాను. తద్వారా నేను టెస్ట్ క్రికెట్‌లో కూడా మంచి ఆటగాడినని మరెవరికో కాదు.. నాకే నేను నిరూపించుకోగలిగాను. రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టకపోవడమే నా తప్పు. నేను ఎక్కువ కాలం ఆడలేను అని చాలా మంది నాపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. నేను ఢిల్లీ జట్టును వదిలి యూపీలో చేరినప్పటి నుంచి మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..