టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌ 10లో టీమిండియా నుండి ఇద్దరికే చోటు.. బౌలింగ్‌లో మరీ దారుణం..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీట20 ర్యాంకిగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా నుండి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ టాప్10 జాబితాలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ మాత్రమే..

టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌ 10లో టీమిండియా నుండి ఇద్దరికే చోటు.. బౌలింగ్‌లో మరీ దారుణం..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీట20 ర్యాంకిగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా నుండి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ టాప్10 జాబితాలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకోగా.. బౌలింగ్ జాబితాలో మనవాళ్ల పేర్లే లేవు. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ పరగా చూస్తే కోహ్లీ, రాహుల్.. తమ ర్యాంకులను కాస్త మెరుగుపరుచుకున్నారు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలవగా, కోహ్లీ ఎనిమదవ స్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ నాలుగవ స్థానంలో ఉండగా, కోహ్లీ తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ముందుకు దూకారు. అలా ఈ ఇద్దరూ చెరొక స్థానం మెరుగుపడి మూడు, ఎనిమిదవ స్థానాల్లో నిలిచారు. మనవాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాటింగ్ ఆర్డర్ టాప్ 10 లిస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ అగ్రస్థానంలో నిలిచాడు. బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు.