రాష్ట్రంలో యువక్రికెటర్లను మరింత ప్రోత్సహిస్తాం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో యువక్రికెటర్లను మరింత ప్రోత్సహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి చెప్పారు. విశాఖపట్నం...

రాష్ట్రంలో యువక్రికెటర్లను మరింత ప్రోత్సహిస్తాం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 10, 2020 | 3:29 PM

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో యువక్రికెటర్లను మరింత ప్రోత్సహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ కార్యాలయం ఏర్పాటు శుభపరిణామమని ఆయన అన్నారు. ఎప్పుడో విశాఖకు ఏసీఏ రావాల్సి ఉందన్న ఆయన.. సరైన సమయంలో ముహూర్తం ఖరారైందన్నారు. ఎక్కడైనా ఇంటర్నేషనల్ మైదానంలోనే ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరిగినప్పుడు క్రికెటర్లకు ఏసీఏ యాక్సెస్ ఈజీగా ఉంటుందని చంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.

కొత్తగా ఏసీఏ కార్యవర్గం రూపుదిద్దుకున్న తరువాత కె ఎస్ భరత్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడని, ఏపీ నుంచి మరింత మంది క్రికెటర్లు ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేలా శ్రమిస్తామన్నారు ఏసీఏ ఆపరేషనల్ డైరెక్టర్ వేణుగోపాలరావు. విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిపాలనా కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఇరువురు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా మాజీ క్రికెటర్లు ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాలరావు,  తదితరులు పాల్గొన్నారు.