ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగంగా చేపట్టాలని హైకోర్టులో పిటీషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం..

ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగంగా చేపట్టాలని గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఈ పిల్‌పై సుప్రీంకోర్టు జడ్జి ఆర్ఎస్ చౌహాన్, జడ్జి బి. విజయ్‌సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Shiva Prajapati
  • Publish Date - 3:03 pm, Thu, 10 December 20
ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగంగా చేపట్టాలని హైకోర్టులో పిటీషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం..

ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగంగా చేపట్టాలని గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఈ పిల్‌పై సుప్రీంకోర్టు జడ్జి ఆర్ఎస్ చౌహాన్, జడ్జి బి. విజయ్‌సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని పిటిషనర్ కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. అయితే.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు పోలీసులు సహకరించడం లేదని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. విచారణకు పోలీసులు సహకరించట్లేదనే విషయాన్ని న్యాయాధికారులు నివేదించలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులను సుప్రీం, హైకోర్టు పర్యవేక్షిస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుల విచారణకు సంబంధించి.. సుప్రీంకోర్టుకు నెలవారీ నివేదికను పంపిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం, హైకోర్టు పరిధిలో ఉన్నందున మళ్లీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.