Kyle Jamieson: కివీస్ యువ ఆల్‌రౌండర్‌పై కోట్ల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యంత ధర పలికిన ఆటగాడు..

Kyle Jamieson IPL Auction 2021: అనుకున్నట్లుగానే జరిగింది. న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్..

  • Ravi Kiran
  • Publish Date - 6:26 pm, Thu, 18 February 21
Kyle Jamieson: కివీస్ యువ ఆల్‌రౌండర్‌పై కోట్ల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యంత ధర పలికిన ఆటగాడు..

Kyle Jamieson IPL Auction 2021: అనుకున్నట్లుగానే జరిగింది. న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డారు. 75 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన జేమిసన్ బిడ్ రూ. 15 కోట్ల దగ్గర ముగిసింది. భారీ మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ యువ ఆటగాడిని సొంతం చేసుకుంది. వన్డేలు, టెస్టులు, టీ20లు అని తేడా లేకుండా జేమిసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా,  ఈ ఐపీఎల్ మినీ వేలంలో అనూహ్యంగా అపార అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లకు ఎదురుదెబ్బ తగలగా.. యువ కెరటాలు, స్టార్ ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు గురి సాధించాయి.

అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే…

  1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.14.25 కోట్లు)
  2. క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)
  3. జహ్య్ రిచర్డ్‌సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు)
  4. మొయిన్ అలీ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 7 కోట్లు)
  5. నాథన్ కౌల్టర్‌నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)
  6. కృష్ణప్ప గౌతమ్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 9.25 కోట్లు)
  7. టామ్ కరన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 5.25 కోట్లు)
  8. షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 లక్షలు)
  9. శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
  10. మెరెడిత్ – పంజాబ్ కింగ్స్(రూ. 8 కోట్లు)
  11. జేమిసన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 15 కోట్లు)
  12. శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
  13. ఆడమ్ మిలన్- ముంబై ఇండియన్స్(రూ.3.20 కోట్లు)
  14. షకిబుల్ హాసన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ.3.20 కోట్లు)
  15. పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్(రూ. 2.40 కోట్లు)
  16. స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2.20 కోట్లు)
  17. హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ.  4.20 కోట్లు)