IND vs PAK: ఆసియా కప్ మళ్లీ మనదే.. ఫైనల్‌‌లో పాకిస్థాన్‌‌పై టీమిండియా విజయం.. అత్యధిక సార్లు టోర్నీ విజేతగా రికార్డు..

Men's Hockey Junior Asia Cup: పోటీ ఏదైనా భారత్‌ ఎదుట ప్రత్యర్థి స్థానంలో పాకిస్థాన్ ఉంటే క్రీడాభిమానులకు వచ్చే మజా వేరే ఉంటుంది. గురువారం జరిగిన హాకీ జూనియర్స్ ఆసియా కప్ ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడగా.. పాకిస్థాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఓమన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఆద్యంతం..

IND vs PAK: ఆసియా కప్ మళ్లీ మనదే.. ఫైనల్‌‌లో పాకిస్థాన్‌‌పై టీమిండియా విజయం.. అత్యధిక సార్లు టోర్నీ విజేతగా రికార్డు..
Ind Beat Pak By 2 1and Lifts Asia Cup Trophy For 4th Time
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:39 AM

Men’s Hockey Junior Asia Cup: పోటీ ఏదైనా భారత్‌ ఎదుట ప్రత్యర్థి స్థానంలో పాకిస్థాన్ ఉంటే క్రీడాభిమానులకు వచ్చే మజా వేరే ఉంటుంది. గురువారం జరిగిన హాకీ జూనియర్స్ ఆసియా కప్ ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడగా.. పాకిస్థాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది.  ఓమన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఆద్యంతం కూడా ఆధిపత్యం చూపిన టీమిండియా మరో సారి ఆసియా కప్‌ని తన ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ తరఫున.. ఫైనల్ మ్యాచ్‌లో అంగద్‌బీర్‌ సింగ్‌ (13వ నిముషంలో), అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ (20వ నిముషంలో) చేరో గోల్‌ చేయగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టు నుంచి అలీ బషారత్‌(38వ నిముషంలో) ఒకే ఒక్క గోల్‌ చేశాడు. అలా పాకిస్థాన్‌పై టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. ఇక భారత్‌కి ఆసియా కప్ టైటిల్‌ గెలవడం ఇది నాల్గొసారి. అంతకముందు 2004, 2008, 2015 టోర్నీలలో భారత్ చాంపియన్‌గా నిలిచింది. 2021లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా రద్దవడంతో.. ఈ ఏడాది జరిగిన టోర్నీకి భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో ఆడింది.

మరోవైపు భారత్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ని గెలిచిన జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ టోర్నీకి ముందు పాకిస్థాన్(1988, 1992, 1996), భారత్(2004, 2008, 2015) చెరో 3 టైటిల్స్‌తో సమానంగా ఉండేవి. కానీ తాజా ట్రోఫీతో పాకిస్థాన్‌ని టీమిండియా వెనక్కి నెట్టేసింది. ఇదిలా ఉండగా ఆసియా కప్ 2023 టోర్నీ మూడో స్థానం కోసం దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. తద్వారా తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు.. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మలేషియా కౌలాలంపూర్ వేదికగా జరిగే జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. విశేషమేమిటంటే టోర్నీ మొత్తంలో భారత్‌ 50 గోల్స్‌ సాధించి.. కేవలం నాలుగు గోల్స్‌‌నే సమర్పించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..