Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ప్రేయసి ఎవరో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Ruturaj Gaikwad Fiancee Utkarsha Pawar: ఐపీఎల్ 2023లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన రుతురాజ్ గైక్వాడ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. గైక్వాడ్ కాబోయే భార్య కూడా క్రికెటరే కావడం విశేషం.

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ప్రేయసి ఎవరో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
Ruturaj Gaikwad
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:21 AM

ఐపీఎల్ 2023 ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జట్టులో భాగమైన భారత యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నివేదికల ప్రకారం, రుతురాజ్ తన స్నేహితురాలిని జూన్ 3న వివాహం చేసుకోనున్నారు. నివేదికల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ తన వివాహం కారణంగానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టాండ్‌బై ప్లేయర్‌గా జైస్వాల్‌ను ఇంగ్లండ్ పంపించారు. కాగా, రుతురాజ్ గైక్వాడ్ కాబోయే భార్య పేరు ఉత్కర్ష పవార్. అసలు ఉత్కర్ష ఎవరు, వీరిద్దరి మధ్య ప్రేమాయణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్కర్ష పవార్ ఎవరు?

రుతురాజ్ గైక్వాడ్ లాగే ఉత్కర్ష పవార్ కూడా క్రికెటర్ అనే విషయం మీకు తెలుసా?. ఉత్కర్ష స్వస్థలం పూణే. ఆమె అక్టోబర్ 13, 1998 న జన్మించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రుతురాజ్ ఒక ఫొటోను పంచుకున్నాడు. ఇందులో చెన్నై కెప్టెన్ ధోని ఒకవైపు, గైక్వాడ్ ప్రేయసి ఉత్కర్ష మరోవైపు కనిపించారు. ‘నా జీవితంలో ఇద్దరు VVIPలు’ అంటూ ఆ ఫొటోకు క్యాఫ్షన్ అందించాడు.

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష గురించి మాట్లాడితే, నివేదికల ప్రకారం ఉత్కర్ష 11 సంవత్సరాల వయస్సు నుంచి క్రికెట్ ఆడుతోంది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతోంది. ఉత్కర్ష ఆల్ రౌండర్‌గా పేరుగాంచింది. 24 ఏళ్ల ఉత్కర్ష మహిళల సీనియర్ వన్డే ట్రోఫీలో సందడి చేసింది. క్రికెట్‌తోపాటు ఉత్కర్ష పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. గ‌త 18 నెల‌లుగా ఉత్కర్ష పవార్ క్రికెట్‌కు దూరంగా ఉంటోంది.

View this post on Instagram

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

ఐపీఎల్‌లో అదగొట్టిన రుతురాజ్..

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. తుఫాన్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ 590 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..