AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Released Players: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి 5గురు ఔట్.. కావ్యపాప రిటెన్షన్ లిస్ట్‌లో తెలుగబ్బాయ్

SRH Released Players 2026: ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగిసింది. రేపటి నుంచి ప్లే ఆఫ్స్ మొదలుకానున్నాయి. అయితే, ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధపెట్టింది. 6 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

SRH Released Players: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి 5గురు ఔట్.. కావ్యపాప రిటెన్షన్ లిస్ట్‌లో తెలుగబ్బాయ్
Srh Released Players 2026
Venkata Chari
|

Updated on: May 28, 2025 | 1:47 PM

Share

SRH Released Players 2026: ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు నిరాశాజనకమైన ప్రదర్శన తర్వాత, 2026 మెగా వేలానికి ముందు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. జట్టు కూర్పును బలోపేతం చేసుకోవడానికి, కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని లేదా అధిక ధర పలికిన ఆటగాళ్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

SRH 2026లో విడుదల చేయనున్న ఐదుగురు ఆటగాళ్లు..

మొహమ్మద్ షమీ (Mohammed Shami): ఐపీఎల్ 2025 వేలంలో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, గత సీజన్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా అతను ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. 9 మ్యాచ్‌లలో 6 వికెట్లు మాత్రమే తీసి, 11.23 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అతని అధిక ధర, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా, SRH అతనిని విడుదల చేసి, యువ భారతీయ పేసర్లపై పెట్టుబడి పెట్టాలని చూస్తోంది.

ఆడమ్ జంపా (Adam Zampa): ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను SRH రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో జంపాను తీసుకున్నప్పటికీ, అతను ప్రభావం చూపలేకపోయాడు. 2025లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి, 8 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చి 2 వికెట్లు మాత్రమే తీశాడు. అతను త్వరగా గాయపడటం, అతని పేలవమైన ఫామ్ జట్టుకు భారంగా మారాయి.

ఇవి కూడా చదవండి

నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy): నితీష్ కుమార్ రెడ్డిని SRH రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకుంది. అతను గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, 2025 సీజన్‌లో మాత్రం నిలకడగా రాణించలేకపోయాడు. బ్యాటింగ్‌లో 11 మ్యాచ్‌లలో 178 పరుగులు మాత్రమే చేసి, బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని అధిక రిటెన్షన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే, జట్టు బలోపేతం కోసం నితీష్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇషాన్ కిషన్ (Ishan Kishan): వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను 2025 సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో సెంచరీ మినహా, మిగిలిన మ్యాచ్‌లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అతని అధిక ధర, అస్థిరమైన ఫామ్ కారణంగా, SRH అతనిని విడుదల చేసి, కొత్త ఓపెనింగ్ లేదా వికెట్ కీపింగ్ ఆప్షన్ కోసం వెతికే అవకాశం ఉంది.

అభినవ్ మనోహర్ (Abhinav Manohar): బ్యాట్స్‌మెన్ అభినవ్ మనోహర్‌ను SRH రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 2025 సీజన్‌లో 7 మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మధ్యకాలంలో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. కాబట్టి, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని స్థానంలో మెరుగైన ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం ఉంది.

ఈ ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా SRH తమ పర్స్‌ను పెంచుకొని, 2026 మెగా వేలంలో జట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా భారతీయ బౌలర్లు, ఆల్‌రౌండర్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..