Sunil Chhetri: ముగిసిన శకం.. కన్నీటితో ఆటకు వీడ్కోలు పలికిన సాకర్ దిగ్గజం.. ఎమోషనల్ వీడియో 

భారత ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రీ కన్నీటీతో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గురువారం (జూన్ 6న) కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం  వేదికగా లక్షలాది మంది అభిమానుల మధ్యన ఆటకు గుడ్ బై చెప్పేశాడు

Sunil Chhetri: ముగిసిన శకం.. కన్నీటితో ఆటకు వీడ్కోలు పలికిన సాకర్ దిగ్గజం.. ఎమోషనల్ వీడియో 
Sunil Chhetri
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2024 | 11:04 AM

భారత ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రీ కన్నీటీతో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గురువారం (జూన్ 6న) కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం  వేదికగా లక్షలాది మంది అభిమానుల మధ్యన ఆటకు గుడ్ బై చెప్పేశాడు. కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత 39 ఏళ్ల ఛెత్రీ తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడీ సాకర్ దిగ్గజం. సునీల్ ఛెత్రీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కోసం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. అతని కోసమే మ్యాచ్‌ను చూడటానికి లక్షలాది మంది అభిమానులను స్టేడియంకు రా తరలి వచ్చారు. ఇక మ్యాచ్ లో ఛెత్రీ బంతిని అందుకున్నప్పుడు, పాస్ చేసినప్పుడు, షాట్ కొట్టినప్పుడు ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగిపోయింది. దాదాపు 100 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు టీమ్ ఇండియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఎన్నోసార్లు గోల్స్ చేసి జట్టును ఆదుకున్న కెప్టెన్ ఛెత్రీ.. ఈసారి మాత్రం రాణించలేకపోయాడు. చివరికి మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ రిఫరీ ఫైనల్ విజిల్ మోగిన వెంటనే ఛెత్రీ సహా భారత ఆటగాళ్లంతా నిరాశకు గురయ్యారు.

మ్యాచ్ తర్వాత స్టేడియంలో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. సునీల్ ఛెత్రి ఇక గ్రౌండ్ లో కనిపించడన్న వాస్తవాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.స్టేడియంలోని ప్రతి భారతీయ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. ఛెత్రీ కూడా తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకున్నాడు. కన్నీళ్లు బయటకు ఉబికి వస్తున్నప్పటికీ ఆటగాళ్లందరినీ కౌగిలించుకుని, కరచాలనం చేస్తూ అభినందనలు తెలిపాడు. ఆ తర్వాత మైదానం చుట్టూ తిరుగుతూ తన కెరీర్‌లో చివరి ప్రయాణంలో తనతో పాటు ఉన్నందుకు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో ఆటగాళ్లతో పాటు, అభిమానుల కళ్లలో నీళ్లు తిరిగాయి

ఇవి కూడా చదవండి

దాదాపు 19 సంవత్సరాలు జాతీయ జట్టు కోసం ఆడిన 39 ఏళ్ల ఛెత్రీని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ వంటి ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్లబ్‌లు ఘనంగా సత్కరించాయి . గత 12 ఏళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్న ఛెత్రీ.. దేశం తరఫున 151 మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..