ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారం ఆరోగ్యానికి హానికరం అనే అపోహను నిపుణులు తోసిపుచ్చుతున్నారు. అయితే, పాడైన కుక్కర్లను వాడటం ప్రమాదకరం. సముద్రపు ఆహారాలు, పాస్తా, పాలు, పన్నీర్, ఆకుకూరలు వంటి కొన్నింటిని ప్రెషర్ కుక్కర్లో వండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల పోషకాలు నశించవచ్చు లేదా రుచి మారవచ్చు.