Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సిల్వర్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్..

Paralympics 2021: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్‌ పోటీల్లో అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు..

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సిల్వర్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్..
Praveen
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:32 PM

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. పురుషుల హైజంప్‌ T64 విభాగంలో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకాన్ని సాధించాడు. హైజంప్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. అంతకముందు ఈ విభాగంలో మరియప్పన్, నిషద్, శరద్ పతకాలు సాధించారు. ఇక తాజాగా సాధించిన పతకంతో కలిపి భారత్ ఖాతాలో 11 పతకాలు ఉన్నాయి. వాటిల్లో రెండు స్వర్ణం, 6 రజతం, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే 18 ఏళ్లకే ప్రవీణ్ కుమార్ పతకాన్ని అందుకోవడం విశేషం.

కాగా, పారాలింపిక్స్‌లో రజతం సాధించిన ప్రవీణ్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ”పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ రజతం సాధించందుకు గర్వంగా ఉంది. ఈ పతకం అతడి కృషి, అసమానమైన అంకితభావానికి తగిన ఫలితం. కంగ్రాట్స్ ప్రవీణ్. భవిష్యత్తులో కూడా ఎన్నో విజయాలు దక్కాలని కోరుకుంటున్నా” అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..