Paralympics: మరోసారి అదరగొట్టిన అవని లేఖారా.. భారత్ ఖాతాలో మరో పతకం..

Ravi Kiran

Ravi Kiran | Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:30 PM

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ జోరు చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. తాజాగా మరో పతకం..

Paralympics: మరోసారి అదరగొట్టిన అవని లేఖారా.. భారత్ ఖాతాలో మరో పతకం..
Avani Lekhara

Follow us on

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ జోరు చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. తాజాగా మరో పతకం భారత్ ఖాతాలోకి చేరింది. షూటర్ అవని లేఖారా గన్‌తో అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ నుంచి అసాధారణ రీతిలో ప్రదర్శన కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తోంది.

ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిన ఈమె.. తాజాగా జరిగిన జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. దీనితో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. వాటిల్లో రెండు స్వర్ణం, 6 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, మరో పతకాన్ని సాధించిన అవని లేఖారాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అటు ప్రవీణ్ కుమార్ పురుషుల హైజంప్‌ T64 విభాగంలో 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకాన్ని సాధించాడు. 18 ఏళ్లకే పతకం సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu