ధోని శిష్యుడు టీమిండియాకు చుక్కలు చూపించాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు.. అతడు ఎవరో తెలుసా?
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కునేది. మన బ్యాట్స్‌మెన్లు స్పిన్నర్లకు చుక్కలు చూపించేవారు. అయితే ఇప్పుడు కాలం..
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కునేది. మన బ్యాట్స్‌మెన్లు స్పిన్నర్లకు చుక్కలు చూపించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో తడబడుతున్నారు. సరిగ్గా ఇదే సీన్ మూడు సంవత్సరాల క్రితం జరిగింది. 2018లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఓ ఆఫ్ స్పిన్నర్ ముందు తలవొంచింది. గెలిచే మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ల పేలవమైన ప్రదర్శనతో చేతులెత్తేసింది. అతడు కేవలం పార్ట్ టైమ్ స్పిన్నర్ మాత్రమే.. కానీ మొత్తం ఆ మ్యాచ్‌కు హీరో అయ్యాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఈ సీన్ జరిగింది. ఇక ఆ స్పిన్నర్ ఎవరో కాదు.. మొయిన్ అలీ. ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ తొమ్మిది వికెట్లు తీసి, ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అనూహ్యంగా భారత ఫాస్ట్ బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కర్రన్(78), మొయిన్ అలీ(40) రాణించడంతో 246 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అటు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. పుజారా(132) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ ఐదు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 271 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (69), జో రూట్ (48) సామ్ కర్రన్(46)లు రాణించారు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీశాడు. దీనితో టీమిండియా ముందు 245 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది.
61 పరుగులకే 7 వికెట్లు…
లక్ష్యచేధనలో విరాట్ కోహ్లీ (58), అజింక్య రహానే (51) 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ మూడు వికెట్లకు 123 పరుగులు చేసింది. అందరూ ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని అనుకున్నారు. అయితే అప్పుడే ధోని టీమ్‌మేట్, శిష్యుడు మొయిన్ అలీ భారత్‌ను దెబ్బతీశాడు. మిగిలిన 7 వికెట్లు 61 పరుగులకు పడ్డాయి. దీనితో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతేకాకుండా మొయిన్ ఆలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
కాగా, మహేంద్రసింగ్ ధోనిని తనకు ఆదర్శం అని మొయిన్ ఆలీ చాలా సందర్భాల్లో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ధోనిని చూసి చాలా నేర్చుకోవచ్చునని.. ఈ జెనరేషన్ క్రికెటర్లలో ధోని ది బెస్ట్ మాత్రమే కాదని.. బెస్ట్ కెప్టెన్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
Read Also: ఒక్క వికెట్ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?
హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..